Can Sreenu Vaitla win with ‘AAA’?


Can Sreenu Vaitla win with 'AAA'?

శ్రీను వైట్ల హిట్ కొడతాడా?

వరుస మూడు డిజాస్టర్లతో డైరెక్టర్ గా డిమాండ్ కోల్పోయిన శ్రీను వైట్ల ఆశలన్నీ ‘అమర్ అక్బర్ ఆంటోని’ సినిమాపైనే ఉన్నాయి. మహేష్ తో ‘ఆగడు’, రామ్ చరణ్ తో ‘బ్రూస్ లీ’, వరుణ్ తేజ్ తో ‘మిస్టర్’ వంటి వరుస ఫ్లాపులిచ్చాడు వైట్ల. ‘బ్రూస్ లీ’ తర్వాత పెద్ద హీరోల నుంచి పిలుపు లేకపోవడం వల్లే వరుణ్ తో ‘మిస్టర్’ చేశాడని అప్పుడంతా చెప్పుకున్నారు. ఇప్పుడు ఫ్లాపుల్లో ఉన్న రవితేజతో ‘అమర్ అక్బర్ ఆంటోని’ చేశాడు. ఇదివరకు తాను చేసిన తప్పులవల్లే ఫ్లాపులొచ్చాయని ఆయన ఒప్పుకుంటున్నాడు. ‘అమర్ అక్బర్ ఆంటోని’ రవితేజతో శ్రీను చేసిన మూడో సినిమా. ఇదివరకు ఆ ఇద్దరూ కలిసి చేసిన ‘వెంకీ’, ‘దుబాయ్ శ్రీను’ సినిమాలు బయ్యర్లకు లాభాలు తెచ్చాయి. ఈ నేపథ్యంలో తమ కాంబినేషన్ హ్యాట్రిక్ సాధిస్తుందనే నమ్మకాన్ని శ్రీను వ్యక్తం చేస్తున్నాడు. ఆరేళ్ళ తర్వాత ఇలియానా తెలుగులో చేసిన సినిమా కావటాన ప్రేక్షకుల్లో ఈ సినిమాపై ఆసక్తి ఎక్కువగానే ఉంది. అయితే రవితేజ, ఇలియానా కాంబినేషన్లో  ఇదివరకు వచ్చిన మూడు సినిమాల్లో ఒక్క ‘కిక్’ మాత్రమే హిట్టయింది. ‘ఖతర్నాక్’, ‘దేవుడు చేసిన మనుషులు’ సినిమాలు ఫ్లాపయ్యాయి. ఇప్పుడు వాళ్ళజోడీకి ఇది నాలుగో సినిమా. నవంబరు 16 న వస్తున్నఈ సినిమా శ్రీనుతో పాటు ఇలియానాకూ ఒక పరీక్షే. వాళ్ళు ఆ పరీక్షలో నెగ్గుతారో, లేదో.. లెటజ్ వెయిట్ అండ్ సీ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *