Antariksham: Flopped Hard


Anthariksham Trailer

అంతరిక్షం: బాక్సాఫీస్ డిజాస్టర్

వరుణ్‌తేజ్ హీరోగా సంకల్ప్ డైరెక్ట్ చేసిన ‘అంతరిక్షం’ సినిమా బాక్సాఫీస్ వద్ద అత్యంత నిరాశాజనక ఫలితాన్ని నమోదు చేస్తోంది. క్రిష్ సమర్పించిన ఈ సినిమాలో అదితిరావ్ హైదరి, లావణ్యా త్రిపాఠి నాయికలుగా నటించారు. ట్రైలర్, పబ్లిసిటీతో విడుదలకు ముందు సినిమాకు వచ్చిన హైప్ కలెక్షన్లలో కనిపించలేదు.

తనకు లభించిన తక్కువ వనరులతోనే సంకల్ప్ సాంకేతికంగా ఉన్నత స్థాయిలో రూపొందించినా, ప్రేక్షకులు ఎదురుచూసిన వినోదం లేకపోవడం మైనస్ అయ్యింది. ఏ సెంటర్లలోని ప్రేక్షకులు ఇప్పటికే అత్యున్నత స్థాయి విజువల్ ఎఫెక్ట్స్‌తో తీసిన హాలీవుడ్ స్పేస్ ఫిలిమ్స్‌ను చూసి ఉండటం వల్ల ‘అంతరిక్షం’లోని విజువల్స్ వాళ్లను మెప్పించలేకపోయాయి.

ఫలితంగా రూ. 19 కోట్లకు అమ్ముడుపోయిన ఈ సినిమా తొలి మూడు రోజుల్లో కేవలం రూ. 4.5 కోట్లను మాత్రమే వసూలు చేసి, డిజాస్టర్‌గా నిలిచేందుకు సిద్ధమవుతోంది. ‘ఫిదా’, ‘తొలిప్రేమ’ వంటి హిట్ల తర్వాత వరుణ్ చేసిన ఈ విభిన్న చిత్రం అతనికి చేదు ఫలితాన్నిచ్చింది.