F2 Audio: To Be Excited


F2 Audio: To Be Excited

ఎఫ్2 పాటలు: డిసెంబర్ 30న వస్తున్నాయి

వెంకటేశ్, వరుణ్‌తేజ్ హీరోలుగా నటించిన ‘ఎఫ్2: ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్’ సినిమా పాటలు డిసెంబర్ 30న విడుదలవుతున్నాయి. అనిల్ రావిపూడి డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో వెంకీ సరసన తమన్నా, వరుణ్ జోడీగా మెహరీన్ నటించారు. దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు కూర్చిన రెండు పాటల లిరికల్ వీడియోలు ఇప్పటికే విడుదలయ్యాయి. వాటిలో ‘రెచ్చిపోదాం బ్రదర్’ పాటను వెంకటేశ్, వరుణ్‌తో పాటు రాజేంద్రప్రసాద్‌పై చిత్రీకరిస్తే, ‘ఎంతో ఫన్’ పాటను వెంకటేశ్, తమన్నాపై తీశారు.

డిసెంబర్ 12న విడుదలైన టీజర్‌కు చక్కని స్పందన వచ్చింది. ఇప్పటివరకు దానికి 7.3 మిలియన్ వ్యూస్ వచ్చాయి. పూర్తి స్థాయి ఫ్యామిలీ ఫన్ మూవీగా అనిల్ ఈ సినిమాని రూపొందించాడని దిల్ రాజు చెప్పారు. వెంకటేశ్ ఆంధ్రా యువకుడిగా, వరుణ్‌తేజ్ తెలంగాణ అబ్బాయిగా నవ్వులు కురిపించే ఈ సినిమా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వస్తోంది.