Majili: Coming In April 2019


Majili: Coming In April 2019

మజిలీ: ఏప్రిల్ విడుదల

అక్కినేని నాగచైతన్య, సమంత జంటగా నటిస్తున్న ‘మజిలీ’ వచ్చే ఏప్రిల్ లో విడుదల కాబోతుంది. ఈ విషయాన్ని ఆ చిత్ర దర్శకుడు శివ నిర్వాణ ట్విట్టర్ వేదికగా తెలిపారు. ‘దేర్ ఈజ్ ల‌వ్.. దేర్ ఈజ్ పెయిన్’ అనేది ఈ సినిమా ట్యాగ్ లైన్. డిసెంబర్ 30న రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ కు అనూహ్యమైన స్పందన వచ్చిందని శివ తెలిపారు.

“ఇప్పటి వరకు 70 శాతం షూటింగ్ పూర్తయింది. ఒక అందమైన సినిమాగా మీ ముందుకు రానుంది. ఏప్రిల్లో కలుద్దాం” అని ఆయన ట్వీట్ చేశారు. నాగచైతన్య, సమంత లుక్ ఇందులో చాలా కొత్తగా ఉంది. ‘నిన్నుకోరి’ లాంటి ఎమోష‌న‌ల్ హిట్ సినిమా తెర‌కెక్కించిన శివ నిర్వాణ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.

వైజాగ్ నేపథ్యంలో ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ తెరకెక్కుతోంది. దివ్యాంశ కౌశిక్ ఈ చిత్రంలో రెండో హీరోయిన్ గా నటిస్తున్నారు. రావు రమేష్, పోసాని కృష్ణమురళి, సుబ్బరాజు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. గోపి సుందర్ సంగీతం అందిస్తుండగా, విష్ణు వర్మ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. సాహు గ‌ర‌పాటి, హరీష్ రెద్ది  ‘మజిలీ’ చిత్రాన్ని  షైన్ స్క్రీన్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు.