NTR Kathanayakudu Poster: Ravanasura Getup Revealed


NTR Kathanayakudu Poster: Ravanasura Getup Revealed

యన్.టి.ఆర్ – కథానాయకుడు పోస్టర్: రావణాసుర గెటప్‌లో బాలకృష్ణ

ఎన్టీఆర్ జీవిత కథ ఆధారంగా రూపొందుతున్న రెండు చిత్రాల్లో తొలి చిత్రం ‘యన్.టి.ఆర్: కథానాయకుడు’ ఆడియో, ట్రైలర్ విడుదల కార్యక్రమాలు డిసెంబర్ 21న జరగనున్నాయి. ఆ రోజు సాయంత్రం 5 గంటల నుంచి హైదరాబాద్‌లోని జేఆర్‌సీ కన్వెన్షన్ సెంటర్ (ఫిల్మ్ నగర్)లో అట్టహాసంగా ఈ వేడుకను నిర్వహించనున్నారు.

బాలకృష్ణ టైటిల్ రోల్ చేస్తూ నిర్మిస్తున్న ఈ సినిమాకు క్రిష్ డైరెక్టర్. ఈ వేడుకకు సంబంధించిన పోస్టర్‌ను డిసెంబర్ 20న విడుదల చేశారు. ‘భూకైలాస్’, ‘సీతారామ కల్యాణం’ చిత్రాల్లో రావణాసురుడిగా ఎన్టీఆర్ చిరస్మరణీయ నటనను ప్రదర్శించిన విషయం తెలిసిందే. పోస్టర్‌లో రావణుడి గెటప్‌లో బాలకృష్ణ విశేషంగా ఆకట్టుకుంటున్నారు. జనవరి 9న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది.