Padi Padi Leche Manasu Trailer: 5 Things To Expect


Padi Padi Leche Manasu Trailer: 5 Things To Expect

పడి పడి లేచే మనసు ట్రైలర్: ఊహల్లో 5 విషయాలు

శర్వానంద్, సాయిపల్లవి జంటగా నటించిన ‘పడి పడి లేచే మనసు’ ట్రైలర్ డిసెంబర్ 14న విడుదల కానున్నట్లు నిర్మాత చెరుకూరి సుధాకర్ ప్రకటించారు. హను రాఘవపూడి డైరెక్ట్ చేసిన ఈ సినిమాకు విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించారు. శర్వానంద్, సాయిపల్లవి జంట అంటేనే ప్రేక్షకుల్లో ఒక క్రేజ్ ఏర్పడింది. ఇప్పటికే ‘ఫిదా’లో వరుణ్ తేజ్‌తో, ‘మిడిల్ క్లాస్ అబ్బాయి’లో నానితో పల్లవి కెమిస్ట్రీ అందర్నీ ఆకట్టుకుంది.

ఆ ఇద్దర్నీ మించి శర్వానంద్‌తో ఆమె జోడీ ఆకట్టుకుంటుందా? ఇప్పటికే పల్లవిని కూర్చోబెట్టి, రిక్షాతో దౌడు తీస్తున్న శర్వానంద్ స్టిల్ ఆకట్టుకుంటోంది. ట్రైలర్‌లో ఆ ఇద్దరి కెమెస్ట్రీకి సంబంధించిన సీన్ ఏమైనా ఉంటుందా? చూడాలి. హైదరాబాద్‌తో పాటు నేపాల్, కోల్‌కతాల్లోనూ షూటింగ్ చేశారు కాబట్టి ఆ నేపథ్యాల సన్నివేశాల్నీ మనం ఆశించడంలో తప్పులేదు.

శర్వానంద్ ఇందులో భిన్న గెటప్పుల్లో కనిపిస్తున్నట్లు స్టిల్స్ చెబుతున్నాయి. వాటిలో ఒకటి జుట్టు పెంచిన రూపం కూడా ఉంది. అది ఫ్లాష్‌బ్యాక్‌కు సంబంధించినదా, లేక సాయిపల్లవితో విడిపోయాక పెంచినదా? ఆ విషయం ట్రైలర్ ఏమైనా క్లూ ఇస్తుందేమో చూడాలి. సినిమాలో సునీల్ కీలక పాత్ర చేసినట్లు యూనిట్ చెబుతోంది. అతను హీరో ఫ్రెండ్‌గా కనిపించి కామెడీ చేస్తాడా? లేక అతని పాత్రలో ఎమోషనల్ అంశాలు కూడా ఉంటాయా?

వీటితో పాటు ఆసక్తి కలిగిస్తున్న ఇంకో విషయం.. ప్రియా రామన్ చాలా కాలం తర్వాత తెలుగులో నటించడం. హీరోయిన్‌గా తెలుగులో ఒకప్పుడు నటించిన ఆమె ఇందులో పల్లవి తల్లిగా కనిపిస్తుందా? శర్వానంద్ తల్లిగా కనిపిస్తుందా? ట్రైలర్‌లో ఈ విషయాలు ఏమైనా రివీల్ అవుతాయేమో చూడాలి.