Suriya’s 37th Film: Title To Be Revealed On Jan 1st


Suriya's 37th Film: Title To Be Revealed On Jan 1st

సూర్య 37వ చిత్రం: జనవరి 1న టైటిల్ ప్రకటన

సూర్య హీరోగా రూపొందుతున్న 37వ చిత్రం టైటిల్ ను జనవరి 1 వచ్చిన పది నిమిషాలకు, అంటే 12.10 గంటలకు ప్రకటించనున్నారు. ఈ విషయాన్ని ఆ చిత్ర దర్శకుడు కె.వి. ఆనంద్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.
“Your Saviour is someone’s killer” అంటూ ట్విట్టర్లో పోస్ట్ చేసిన పోస్టర్ ఆసక్తి రేపుతోంది. తమిళ టైటిల్ తో పాటు తెలుగు వెర్షన్ టైటిల్ కూడా ఖరారు చేస్తారా, లేదా అనే విషయంపై స్పష్టత లేదు.

మోహన్ లాల్, ఆర్య, సయేషా సైగల్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి హారిస్ జైరాజ్ సంగీతం అందిస్తున్నారు. ‘2.0’ను నిర్మించిన లైకా ప్రొడక్షన్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.