12 Most Anticipated Movies Of 2019


12 Most Anticipated Movies Of 2019

2019: అత్యధిక అంచనాల చిత్రాలు

కొత్త సంవత్సరం వచ్చేసింది. రానున్న 12 నెలల్లో ప్రేక్షకులు ఏ ఏ సినిమాల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారో యాక్షన్ కట్ ఒకే. కామ్ గుర్తించేందుకు ప్రయత్నించింది. దాన్ని దృష్టిలో ఉంచుకుని, ఎంచిన 2019 మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీస్ లిస్ట్ ఇది. ఒక్కసారి అవేమిటో చూద్దాం…

సైరా నరసింహారెడ్డి

తెల్లదొరల్ని ఎదిరించిన తొలి తరం స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా రూపొందుతున్న చిత్రం ‘సైరా.. నరసింహారెడ్డి’. చిరంజీవి ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈ చిత్రానికి సురేందర్‌రెడ్డి దర్శకుడు. నయనతార, అమితాబ్ బచ్చన్, తమన్నా, సుదీప్, జగపతిబాబు, విజయ్ సెతుపతి, హుమా ఖురేషి, నాజర్ ప్రధాన పాత్రధారులు. విడుదల తేదీ ఇంకా ఖరారు కాలేదు.

12 Most Anticipated Movies Of 2019

మహర్షి

మహేశ్ కథానాయకుడిగా వంశీ పైడిపల్లి రూపొందిస్తున్న చిత్రం ‘మహర్షి’. విద్యార్థిగా, శ్రీమంతుడిగా భిన్న దశల రిషి అనే పాత్రలో మహేశ్ కనిపించనున్నాడు. పూజా హెగ్డే నాయిక. ఎమోషనల్ యాక్షన్ ఎన్‌టర్‌టైనర్‌గా తయారవుతున్న ఈ సినిమాలో మహేశ్ స్నేహితునిగా అల్లరి నరేశ్ కనిపించనున్నాడు. ప్రకాశ్‌రాజ్, జయసుధ కీలక పాత్రధారులైన ఈ సినిమా 5 ఏప్రిల్ 2019న ప్రేక్షకుల ముందుకు రానున్నది.

12 Most Anticipated Movies Of 2019

సాహో

‘బాహుబలి’ సినిమాల తర్వాత వచ్చిన అమితమైన క్రేజ్‌తో ప్రభాస్ నటిస్తున్న చిత్రం ‘సాహో’. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఏక కాలంలో తయారవుతున్న ఈ చిత్రానికి సుజిత్ దర్శకుడు. హిందీ తార శ్రద్ధా కపూర్ నాయిక. పూర్తి స్థాయి యాక్షన్ మూవీగా రూపొందుతున్న ఈ సినిమాలో ప్రభాస్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్నాడు. బాలీవుడ్ నటుడు నీల్ నితిన్ ముఖేశ్ విలన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో మందిరా బేడి, ఎవ్‌లీన్ శర్మ, జాకీ ష్రాఫ్, మజేశ్ మంజ్రేకర్, అరుణ్ విజయ్, చంకీ పాండే తారాగణం. ఆగస్ట్ 15న ఈ సినిమా విడుదలవుతోంది.

12 Most Anticipated Movies Of 2019

ఎన్టీఆర్ బయోపిక్

సినీ నటునిగా, రాజకీయ నాయకునిగా తెలుగువాళ్లపై చెరగని ముద్ర వేసిన మహనీయుడు దివంగత ఎన్టీ రామారావు జీవితం ఆధారంగా రూపొందిన రెండు చిత్రాలు ‘యన్.టి.ఆర్: కథానాయకుడు’, ‘యన్.టి.ఆర్: మహానాయకుడు’. ఎన్టీఆర్ కేరక్టర్‌లో బాలకృష్ణ నటించిన ఈ చిత్రాలకు క్రిష్ దర్శకుడు. విద్యాబాలన్, రానా, కల్యాణ్‌రాం, దగ్గుబాటి రాజా, మంజిమా మోహన్, పూనం బజ్వా కీలక పాత్రధారులైన ఈ సినిమాల్లో మొదటిది జనవరి 9న, రెండవది ఫిబ్రవరి 7న వస్తున్నాయి.

12 Most Anticipated Movies Of 2019

వినయ విధేయ రామ

రాంచరణ్ హీరోగా బోయపాట్రి శ్రీను రూపొందించిన చిత్రం ‘వినయ విధేయ రామ’. ఎమోషనల్ యాక్షన్ మూవీగా తయారైన ఈ సినిమాలో చరణ్ చేసే యాక్షన్ సీన్లు హైలైట్ కానున్నాయి. కియారా అద్వానీ నాయికగా నటించిన ఈ సినిమాలో వివేక్ ఓబరాయ్ విలన్. ప్రశాంత్, స్నేహ, ఆర్యన్ రాజేశ్, మహేశ్ మంజ్రేకర్, ముఖేశ్ రుషి కీలక పాత్రధారులు. సంక్రాంతి బరిలో దిగి జనవరి 11న ప్రేక్షకుల ముందుకు వస్తోంది ఈ సినిమా.

12 Most Anticipated Movies Of 2019

ఎఫ్2: ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్

వెంకటేశ్, వరుణ్‌తేజ్ కథానాయకులుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ఎఫ్2: ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్’. తమన్నా, మెహరీన్ నాయికలుగా నటించిన ఈ సినిమా పూర్తి స్థాయి హాస్య భరితంగా తయారైంది. వెంకటేశ్ ఆంధ్రా అల్లుడిగా, వరుణ్ తెలంగాణ అల్లుడిగా నటించిన ఈ సినిమాలో రాజేంద్రప్రాద్, ప్రకాశ్‌రాజ్, ప్రియదర్శి కీలక పాత్రధారులు. జనవరి 12న విడుదలవుతోంది.

12 Most Anticipated Movies Of 2019

డియర్ కామ్రేడ్

‘గీత గోవిందం’ జంట విజయ్ దేవరకొండ, రష్మిక మండన్న నటిస్తున్న చిత్రం ‘డియర్ కామ్రేడ్’. యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా ద్వారా భరత్ కమ్మ దర్శౌడిగా పరిచయమవుతున్నాడు. యక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమా వేసవిలో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.

12 Most Anticipated Movies Of 2019

మిస్టర్ మజ్ను

అఖిల్ అక్కినేని హీరోగా నటించిన మూడో సినిమా ‘మిస్టర్ మజ్ఞు’. వెంకీ అట్లూరి డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో నిధి అగర్వాల్ నాయిక. లవ్ ఎంటర్‌టైనర్‌గా తయారైన ఈ సినిమాలో విద్యుల్లేఖా రామన్, జయప్రకాశ్ కీలక పాత్రధారులు. ఇప్పటివరకు హిట్ రుచి చూడని అఖిల్ ఈ సినిమాపై కోటి ఆశలు పెట్టుకున్నాడు. జనవరి 25న ఈ సినిమా విడుదలవుతోంది.

12 Most Anticipated Movies Of 2019

జెర్సీ

నాని కథానాయకుడిగా ‘మళ్లీ రావా’ ఫేం గౌతం తిన్ననూరి రూపొందిస్తున్న చిత్రం ‘జెర్సీ’. 1986-96 కాలం నేపథ్యంలో తయారవుతున్న ఈ సినిమాలో అర్జున్ అనే క్రికెటర్‌గా నాని కనిపించనున్నాడు. శ్రద్ధా శ్రీనాథ్ నాయికగా నటిస్తున్న ఈ సినిమాలో క్రికెటర్‌గా తన కలల్ని పండించుకోడానికి అర్జున్ ఏం చేశాడన్నది ఆసక్తికరం. విడుదల తేదీ ఖరారు కాలేదు.

12 Most Anticipated Movies Of 2019

మజిలీ

పెళ్లి తర్వాత నాగచైతన్య, సమంతా జంటగా నటిస్తున్న చిత్రం ‘మజిలీ’. శివ నిర్వాణ (‘నిన్నుకోరి’ ఫేం) దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఎమోషనల్ లవ్ స్టోరీగా రూపొందుతోంది. వైజాగ్ నేపథ్యంలో తెరకెకెక్కుతున్న ఈ సినిమాలో దివ్యాంశ కౌశిక్ మరో నాయిక. ఏప్రిల్లో చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.

12 Most Anticipated Movies Of 2019

ఇస్మార్ట్ శంకర్

రామ్ కథానాయకుడిగా పూరి జగన్నాథ్ రూపొందిస్తున్న చిత్రం ‘ఇస్మార్ట్ శంకర్’. జనవరిలోనే షూటింగ్ మొదలవుతోంది. జగన్నాథ్ హీరోలు ఎలా ఉంటారో తెలుసు కాబట్టి, ఇందులో రామ్ ఎలా ఉంటాడో ఊహించుకోవచ్చు. టైటిల్ కూడా అదే చెబుతోంది. ఈ సినిమా ఎప్పుడు విడుదలయ్యేదీ వెల్లడి కాలేదు.

12 Most Anticipated Movies Of 2019

శర్వానంద్ సినిమా

శర్వానంద్ హీరోగా సుధీర్ వర్మ రూపొందిస్తోన్న చిత్రానికి ఇంకా టైటిల్ నిర్ణయించలేదు. ‘హలో’ ఫేం కల్యాణి ప్రియదర్శన్ నాయికగా నటిస్తున్న ఈ సినిమా సస్పెన్స్ యాక్షన్ డ్రామాగా తయారవుతోంది. అనుకున్న ప్రకారం షెడ్యూల్ జరగకపోవడంతో విడుదల తేదీ విషయంలో క్లారిటీ రాలేదు.