2019: The Debut Year Of Star Scions


2019: The Debut Year Of Star Scions

2019: వారసుల సంవత్సరం!

పంజా వైష్ణవ్‌తేజ్.. మెగా ఫ్యామిలీ నుంచి వస్తున్న 11వ నటుడు. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు దర్శకత్వంలో అతను హీరోగా నటించే సినిమా జనవరి 21న ప్రారంభమైంది. ఒక ఇంటెన్స్ లవ్‌స్టోరీతో అతను ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అతనే కాదు, మరి కొంతమంది స్టార్ వారసులు ఈ ఏడాది పరిచయం కానుండటం ఆసక్తిని రేకెత్తిస్తోంది.

2019: The Debut Year Of Star Scions

బాలీవుడ్ హిట్ ఫిల్మ్ ‘2 స్టేట్స్’కు అదే పేరుతో తెలుగులో రీమేక్ అవుతున్న సినిమా ద్వారా శివానీ రాజశేఖర్ వెండితెరకు పరిచయమవుతోంది. ఆమె రాజశేఖర్, జీవిత దంపతుల పెద్ద కుమార్తె. నూతన దర్శకుడు వెంకట్ కుంచం రూపొందిస్తున్న ఈ సినిమాలో ఆమె అడివి శేష్‌కు జోడీగా నటిస్తోంది. నిజానికి శివానీ ప్రస్తుతం మెడిసిన్ చదువుతోంది. కొంత కాలంగా ఆమె పరిచయం గురించి ప్రచారం జరుగుతూ వస్తోంది. ‘2 స్టేట్స్’ సరైన సినిమాగా భావించి ఆమెకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు జీవిత తెలిపారు.

అలాగే బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ, నిర్మాత డి. సురేశ్‌బాబు చిన్న కొడుకు అభిరాం కూడా ఈ ఏడాదే పరిచయమయ్యే అవకాశాలున్నాయని చిత్రసీమలో వినిపిస్తోంది.

2019: The Debut Year Of Star Scions

తమిళంలో విక్రం కుమారుడు ధ్రువ్ విక్రం ‘వర్మా’ సినిమాతో కొద్ది రోజుల్లోనే ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. తెలుగులో విజయ్ దేవరకొండను స్టార్‌గా మార్చిన ‘అర్జున్‌రెడ్డి’కి ఆ సినిమా రీమేక్. సుప్రసిద్ధ తమిళ దర్శకుడు బాలా ఈ సినిమాని డైరెక్ట్ చెయ్యడం విశేషం. ఫిబ్రవరిలోనే ఈ సినిమా విడుదలవుతోంది. వాస్తవానికి ఇంకో రెండేళ్ల తర్వాత ధ్రువ్‌ను హీరోగా పరిచయం చేద్దామని విక్రం భావించాడు. “కానీ ‘అర్జున్‌రెడ్డి’ని చూశాక, నాకు మతిపోయింది. ధ్రువ్ పరిచయానికి ఇంతకంటే కచ్చితమైన సినిమా ఉండదనిపించింది. డైరెక్టర్‌గా బాలా గారే కనిపించారు. అడగగానే ఆయన ఒప్పుకున్నాడు” అని తెలిపాడు విక్రం.

గత ఏడాది ప్రారంభమై ఈ ఏడాది విడుదలవుతున్న తమిళ చిత్రం ‘కళాశాల్’తో ఇద్దరు తారలు పరిచయమవుతున్నారు. హీరోగా ఒకప్పటి హీరోయిన్ అంబిక కుమారుడు రాంకేశవ్, హీరోయిన్‌గా నటుడు లివింగ్‌స్టన్ కూతురు జోవిత పరిచయమవుతున్నారు.