7 Minutes.. Single Take!


7 Minutes.. Single Take!

7 నిమిషాలు.. సింగిల్ టేక్!

రాజశేఖర్ ఎలాంటి నటుడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన అభినయ సామర్థ్యంతో ఎన్నో పాత్రలకు ప్రాణ ప్రతిష్ఠ చేశారు. అయితే చాలా కాలంగా కెరీర్‌లో ఆటుపోట్లు ఎదుర్కొంటూ వచ్చిన ఆయన ‘పిఎస్‌వి గరుడవేగ’ సినిమాతో విజయాన్ని అందుకున్నారు. దాంతో మరింత ఉత్సాహంతో సినిమాలు చేయడానికి సిద్ధమయ్యారు. ఆ క్రమంలో ప్రస్తుతం ‘అ!’ ఫేం ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో ‘కల్కి’ సినిమా చేస్తున్నారు.

యాక్షన్ సన్నివేశాల్లో సాధారణంగా డూప్ ఉపయోగించడానికి ఇష్టపడని ఆయన గతంలో కొన్ని సినిమాల్లో యాక్షన్ సన్నివేశాలు చేస్తూ గాయపడ్డారు కూడా. అయినప్పటికీ ఈ వయసులోనూ యాక్షన్ సీన్లను తనే స్వయంగా చేస్తున్నారు. అలాగే ‘కల్కి’ సినిమాలో ఇటీవల 7 నిమిషాల ఒక యాక్షన్ సన్నివేశాన్ని డూప్ సాయం లేకుండా చేయడమే కాకుండా, సింగిల్ టేక్‌లో చేసి, యూనిట్ సభ్యులనందర్నీ ఆశ్చర్యపరిచారు. సెట్స్‌కు రావడం ఆలస్యం చేస్తారేమో కానీ, వచ్చాక ఆయనెంత ప్రొఫెషనల్‌గా మారిపోతారనే దానికి ఇది నిదర్శనమని వారు చెప్పుకుంటున్నారు.