96 Remake Finally Has Samantha & Sharwa Are As The Official Casting


96 Remake Finally Has Samantha & Sharwa Are As The Official Casting

అఫిషియల్: ’96’ రీమేక్‌లో సమంత, శర్వానంద్

తమిళంలో త్రిష, విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలు పోషించగా ఘన విజయం సాధించిన ’96’ సినిమా తెలుగు రీమేక్‌లో సమంత, శర్వానంద్ నటించడం ఖాయమైంది. ఈ విషయాన్ని నిర్మాత దిల్ రాజు అధికారికంగా ప్రకటించారు. శ్రీ వెంకటేశ్వరా క్రియేషన్స్ పతాకంపై నిర్మాణమయ్యే ఈ 34వ చిత్రాన్ని ఒరిజినల్ డైరెక్టర్ సి. ప్రేంకుమార్ రూపొందించనున్నాడు. ప్రస్తుతం ప్రి ప్రొడక్షన్ పనులు జరుగుతున్న ఈ సినిమా మార్చిలో సెట్స్‌పైకి వెళ్లనున్నది. ఇందులో నటించే ఇతర తారాగణం, పనిచేసే సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలో తెలియజేస్తామని దిల్ రాజు తెలిపారు.

’96’ అనేది రామ్, జానకి అనే ఇద్దరు చిన్ననాటి క్లాస్‌మేట్ల కథ. స్నేహం ప్రేమగా చిగురించాక తప్పనిసరి పరిస్థితుల్లో విడిపోయిన ఆ ఇద్దరూ కొన్నేళ్ల తర్వాత పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో కలుసుకున్నాక ఏం జరిగిందనేది అత్యంత ఆసక్తికరంగా, భావోద్వేగపూరితంగా ప్రేంకుమార్ చిత్రించాడు. వర్తమాన, భూత కాలాల్లో నడిచే ఈ సినిమా కథ ప్రేక్షకుల హృదయాలపై చెరగని ముద్ర వేస్తుందనే నమ్మకంతో దిల్ రాజు తెలుగులో రీమేక్ చేసేందుకు నిర్ణయించుకున్నారు. ఆ పాత్రల్లో సమంత, శర్వానంద్ ఎలా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటారో చూడాలి.