Adivi Sesh: Everyone Gets Wrong About His Versatility


Adivi Sesh: Everyone Gets Wrong About His Versatility
Adivi Sesh: Everyone Gets Wrong About His Versatility

అడివి శేష్: ఊహాతీతంగా ఎదుగుతున్న నటుడు

2010లో అమెరికాలో ‘కర్మ’ అనే సినిమాని రూపొందించి, దాని విడుదల కోసం హైదరాబాద్ వచ్చిన అడివి శేష్‌ను చూసిన చాలామంది ‘ఇలాంటివాళ్లను ఎంతమందిని చూడలేదు? డబ్బులు పోగొట్టుకొని మళ్లీ అమెరికా వెళ్లిపోతాడు’ అనుకున్నారు. వారిలో సినిమా జర్నలిస్టులు కూడా ఉన్నారు. ఎందుకంటే ఆ సినిమాకి అతనే హీరో, అతనే దర్శకుడు, నిర్మాత, రచయిత కాబట్టి. ప్రఖ్యాత సాహితీవేత్త అడివి బాపిరాజు మూలాలు అతనిలో ఉన్నాయి. అందుకే స్వతహాగా అతనిలో మంచి రచయిత దాగున్నాడు. సహజంగానే చాలామంది సినిమాల్లాగే అతని తొలి సినిమా ఆడలేదు. కానీ అతడి స్ఫురద్రూపం చాలామందిని ఆకట్టుకుంది. చిత్రంగా రెండో సినిమాలో అతడికి నెగటివ్ రోల్ లభించింది. అది అలాంటిలాంటి సినిమా కాదు, ఏకంగా పవన్ కల్యాణ్ సినిమా ‘పంజా’. అందులో మున్నా అనే సైకోగా అతడి నటన చాలామందిని భయపెట్టింది కానీ ఆ పాత్రకు న్యాయం చేశాడనే పేరు తెచ్చుకున్నాడు. హీరోగా ప్రేక్షకులకు అతి తక్కువ మందికే తెలిసిన అతను విలన్‌గా అత్యధికులకు తెలిశాడు. రవితేజ ‘బలుపు’లోనూ శేష్‌కు నెగటివ్ రోల్ లభిస్తే, అదీ చేశాడు.

Adivi Sesh: Everyone Gets Wrong About His Versatility
Adivi Sesh: Everyone Gets Wrong About His Versatility

అయినా హీరోగా తన ప్రయత్నాలు ఆపలేదు. కానీ చిత్రసీమలో అండదండలు లేనివాళ్లు ఎదగడం చాలా కష్టం కావడం వల్ల శేష్ ఏదో సాధిస్తాడని ఎవరూ అనుకోలేదు. అక్కడే అతడిని చాలా తక్కువగా అంచనా వేశారు. వరుసకు అన్న అయ్యే డైరెక్టర్ అడివి సాయికిరణ్ అప్పటికే ఇండస్ట్రీలో ఉన్నా అతడి సాయం ఏమీ తీసుకోలేదు శేష్. స్వయంకృషినే నమ్ముకున్నాడు. రాజమౌళి దృష్టిలో పడి ‘బాహుబలి’లో భల్లాలదేవ (రానా) కొడుకు భద్ర పాత్రను దక్కించుకున్నాడు. ఆ నెగటివ్ పాత్రను తనదైన శైలిలో పోషించి మెప్పించాడు. మహేంద్ర బాహుబలి అలియాస్ శివుడు ఆ పాత్ర తల నరికే సన్నివేశం గగుర్పాటు కలిగిస్తుంది. అయితేనేం కోట్లాది మంది ప్రేక్షకులకు అడివి శేష్ సుపరిచితమయ్యాడు.

Adivi Sesh: Everyone Gets Wrong About His Versatility

ఇప్పుడూ ప్రేక్షకుల్నే కాదు, సినీ రంగంలోని వాళ్లనూ ఆశ్చర్యపరుస్తూ మళ్లీ హీరో అవతారం ఎత్తాడు. ‘క్షణం’ సినిమాకు రచన చేస్తూ హీరోగా నటించాడు. యాక్షన్ ఎపిసోడ్స్‌లో చక్కగా రాణించాడు. చిన్న సినిమాగా విడుదలై మంచి విజయం సాధించి నిర్మాతకూ, బయ్యర్లకూ అది లాభాలు తీసుకొచ్చింది. దాని తర్వాత మోహనకృష్ణ ఇంద్రగంటి డైరెక్ట్ చేసిన ‘అమీ తుమీ’లో కామిక్ హీరోగా భిన్న పాత్రను చేసి అబ్బురపరిచాడు. నటుడిగా తనలోని విలక్షణతను ప్రదర్శించాడు. ఇక నిరుడు వచ్చిన ‘గూఢచారి’ సినిమా శేష్ ఆత్మవిశ్వాసానికి ప్రతీకగా నిలిచింది. తెలుగులో కృష్ణ తప్ప గూఢచారిగా రాణించిన వాళ్లు లేరు. మహేశ్ కూడా ‘స్పైడర్’తో ఫెయిలయ్యాడు. కానీ శేష్ తన కథనే నమ్ముకుని ‘గూఢచారి’ చేశాడు. శశికిరణ్ తిక్కకు దర్శకత్వ బాధ్యతలు అప్పగించాడు. చిన్న సినిమాల్లో సూపర్ హిట్టయిన సినిమాగా అది నిలిచింది. శేష్‌ను స్టార్‌ను చేసింది ఆ సినిమా. ఐఎండీబీ టాప్ 50 తెలుగు సినిమాల్లో ఒకటిగా నిలిచిన క్రెడిట్ సంపాదించింది. చేసింది తక్కువ సినిమాలే.. కానీ వాటిలోనే ఎన్ని వేరియేషన్స్ ప్రదర్శించాడు! సైకో, జానపద విలన్, కన్నింగ్ కేరెక్టర్ (దొంగాట), యాక్షన్ హీరో, కామిక్ హీరో.. ఇలా చేసిన ప్రతి పాత్రలోనూ రాణించి చక్కని నటుడనిపించుకున్నాడు. శేష్‌ను చులకన చేసినవాళ్లూ, అతడిని తప్పుగా అంచనా వేసినవాళ్లూ నోరు తెరవలేని స్థితి. ఇప్పుడు శేష్ ‘గూఢచారి’కి సీక్వెల్ చేసే ప్రయత్నంలో ఉన్నాడు. రానున్న రోజుల్లో అతడు ప్రేక్షకుల్నీ, చిత్రసీమనీ తన సబ్జెక్టులతో, తన పాత్రలతో ఆశ్చర్యపరుస్తూనే ఉంటాడు.

Adivi Sesh: Everyone Gets Wrong About His Versatility
Adivi Sesh: Everyone Gets Wrong About His Versatility