Another Girl For iSmart Shankar!


Another Girl For iSmart Shankar!

‘ఇస్మార్ట్ శంకర్’లో నభా

Another Girl For iSmart Shankar!

రామ్ హీరోగా పూరి జగన్నాథ్ రూపొందిస్తోన్న ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాలో మరో హీరోయిన్ వచ్చి చేరింది. ఆమె కన్నడ భామ అయిన నభా నటేశ్. సుధీర్‌బాబు హీరోగా నటించిన ‘నన్ను దోచుకొందువటే’ సినిమా ద్వారా అమె తెలుగు తెరకు పరిచయమైంది. ‘ఇస్మార్ట్ శంకర్’ ఆమెకు రెండో తెలుగు సినిమా. ఇందులో ఆమె పక్కా హైదరాబాదీగా కనిపించనుంది. ఈ విషయాన్ని చార్మి ట్విట్టర్ వేదికగా తెలిపింది. పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్ పతాకంపై లావణ్య సమర్పిస్తోన్న ఈ చిత్రాన్ని పూరి కనెక్ట్స్ బేనర్‌పై చార్మి నిర్మిస్తోంది. ఇప్పటికే ఈ సినిమాలో ఒక నాయికగా ‘మిస్టర్ మజ్ను’ ఫేమ్ నిధి అగర్వాల్‌ను ఎంపిక చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఫైట్ మాస్టర్ రియల్ సతీశ్ ఆధ్వర్యంలో యాక్షన్ సన్నివేశాల్ని చిత్రీకరిస్తున్నారు. మేలో చిత్రాన్ని విడుదల చేయాలని సంకల్పించారు.

పునీత్ ఇస్సార్, సత్య దేవ్, మిళింద్ గునాజి, ఆశిష్ విద్యార్థి, గెటప్ శ్రీను, సుధాన్షు పాండే, మధు సింగంపల్లి, కుల్దీప్ సింగ్, దీపక్ శెట్టి తారాగణమైన ఈ చిత్రానికి పాటలు: భాస్కరభట్ల, సంగీతం: మణిశర్మ, సినిమాటోగ్రఫీ: రాజ్ తోట, ఎడిటింగ్: జునైద్ సిద్దిఖి, ఆర్ట్: జానీ షేక్.