Bharateeyudu 2 Launch Date Confirmed


Bharateeyudu 2 Launch Date Confirmed

‘భారతీయుడు 2’ ప్రారంభ తేదీ ఖరారు

కమల్ హాసన్ కథానాయకుడిగా 1996లో విడుదలై తెలుగు, తమిళ భాషలు రెండింటిలోనూ ఘన విజయం సాధించిన ‘భారతీయుడు’ సినిమాకు సీక్వెల్ రాబోతున్న విషయం తెలిసిందే. ఆ సినిమాను రూపొందించిన శంకర్ ‘భారతీయుడు 2’ను డైరెక్ట్ చేసేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే స్క్రిప్ట్ రెడీ అయ్యింది. జనవరి 18న ఈ సినిమాను చెన్నైలో లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఇందులో కమల్ జోడీగా నటించే అవకాశం కాజల్ అగర్వాల్‌కు లభించింది. యువ సంగీత సంచలనం అనిరుధ్ రవిచంద్రన్ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నాడు.

ఒరిజినల్‌లో కమల్ తండ్రీ కొడుకులుగా ద్విపాత్రలు పోషించారు. అవినీతిపరుడిగా మారిన కొడుకును సైతం చంపడానికి వెనుదీయని నిఖార్సయిన స్వాతంత్ర్య సమరయోధుడిగా కమల్ నటన అద్వితీయం. సీక్వెల్‌లో ఆయన ఎలా కనిపిస్తారనేది ఆసక్తికర అంశం. ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్ సంస్థ అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది.