Bunny Is Set With Trivikram While Vikram With Nani!


Bunny Is Set With Trivikram While Vikram With Nani!
Bunny Is Set With Trivikram While Vikram With Nani!

త్రివిక్రంతో బన్నీ, నానితో విక్రమ్!

గత ఏడాది వక్కంతం వంశీ డైరెక్షన్‌లో ‘నా పేరు సూర్య’ సినిమా చేసిన అల్లు అర్జున్ కొంత విరామం తీసుకొని త్రివిక్రమ్ డైరెక్షన్‌లో సినిమా చెయ్యడానికి సిద్ధమవుతున్నాడు. నిజానికి అతను విక్రమ్ కె. కుమార్ దర్శకత్వంలో సినిమా చెయ్యాలనుకున్నాడు. సెన్సిబుల్ డైరెక్టర్‌గా పేరున్న విక్రమ్ చెప్పిన కథ కూడా బన్నీకి నచ్చిందనీ, ఇద్దరూ కలిసి పనిచెయ్యడం ఖాయమనీ అంతా అనుకున్నారు. కానీ ఎందుకనో ఆ సినిమా పట్టాలెక్కలేదు. బన్నీ ఈ సినిమా కేన్సిల్ చేసుకోడానికి విక్రమ్ ఖాతాలో హిట్లు ఉన్నా బ్లాక్‌బస్టర్లు లేకపోవడం ఒక కారణమైతే, హీరోయిజం మీదకంటే సబ్జెక్ట్ మీదే విక్రమ్ ఎక్కువ దృష్టిపెట్టడం ఇంకో కారణమని చెప్పుకున్నారు. ప్రస్తుతం తనకు సూపర్ హిట్ కావాలని, అలాంటిది ఇచ్చే దర్శకుడితోనే పనిచెయ్యాలని బన్నీ నిర్ణయించుకోవడం వల్లే త్రివిక్రంతో మూడోసారి సినిమాకు సిద్ధమయ్యాడనేది అంతర్గత వనరుల సమాచారం. గీతా ఆర్ట్స్‌తో కలిసి హారికా అండ్ హాసినీ క్రియేషన్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.

మరోవైపు బన్నీతో కలిసి చేసే అవకాశం మిస్సవడంతో అదే సబ్జెక్టును నానికి వినిపించాడు విక్రమ్ కుమార్. నాని వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. రొమాంటిక్ కామెడీగా ఈ సినిమాని తీర్చిదిద్దనున్నాడు విక్రమ్. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించే ఈ సినిమా ఫిబ్రవరిలో సెట్స్ మీదకు వెళ్తోంది. అఖిల్‌తో చేసిన ‘హలో’ సినిమా ఊహించిన రీతిలో ఆడకపోవడంతో మరింత శ్రద్ధగా ఈ సబ్జెక్టును తీర్చిదిద్దాడు విక్రమ్. ఇలా అటు బన్నీ, ఇటు విక్రమ్ వేరే వాళ్లతో దాదాపు ఒకే సమయంలో సినిమా చేస్తున్నారు.