F2 Collections: The Venky-Varun Starrer Dominates in Andhra & Nizam Circuits


F2 Collections: The Venky-Varun Starrer Dominates in Andhra & Nizam Circuits

ఎఫ్2: ఆంధ్రా, నైజాంలో కాసుల పంట

వెంకటేశ్, వరుణ్‌తేజ్ హీరోలుగా దిల్ రాజు నిర్మించిన ‘ఎఫ్2: ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్’ సినిమా ఆంధ్రా, నైజాం ఏరియాల్లో కాసుల పంట కురిపిస్తోంది. అనిల్ రావిపూడి డైరెక్ట్ చేసిన ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే బయ్యర్లకు 68 శాతానికి పైగా లాభాలను సమకూర్చడం గమనార్హం. రూ. 28 కోట్ల పెట్టుబడి విలువకు గాను ఈ సినిమా 10 రోజుల్లో ఆర్జించింది రూ. 47.12 కోట్లు. మొదట్నుంచీ సీడెడ్ ఏరియాలో జోరు తక్కువగా ఉన్నా.. ఆంధ్రా, నైజాం ప్రాంతాల్లో ప్రేక్షకులు ఒకే రకంగా ఈ సినిమా చూడ్డానికి తరలి వస్తూనే ఉన్నారు. అందుకే ఈ ప్రాంతాల్లో ఇప్పటికే 78 శాతం పైగా లాభాలను అందుకున్నారు బయ్యర్లు. సీడెడ్‌లో మాత్రం ఈ లాభాల శాతం 22 అని విశ్లేషకులు తెలిపారు. అక్కడ రూ. 5 కోట్ల విలువకు గాను రూ. 1.10 కోటి లాభాలు అందాయి. మరోవైపు నైజాంలో రూ. 7 కోట్లు, ఆంధ్రాలో రూ. 10.95 కోట్ల లాభాలు అందుకున్నారు బయ్యర్లు. 25న అఖిల్ సినిమా ‘మిస్టర్ మజ్ను’ వస్తున్నందున, చాలావరకు థియేటర్లను ఆ సినిమా ఆక్రమిస్తున్నందున ‘ఎఫ్2’ వసూళ్లపై ఆ మేరకు ప్రభావం పడనున్నది.