I’ll Appear In 8 Pack Abs In Mr Majnu Title Song: Akhil


I'll Appear In 8 Pack Abs In Mr Majnu Title Song: Akhil

టైటిల్ సాంగ్‌లో 8 ప్యాక్‌లో కనిపిస్తా: అఖిల్

సాధారణంగా ఎవరైనా హీరో 6 ప్యాక్‌లో కనిపిస్తేనే ఆశ్చర్యపోతుంటాం. తెలుగు తెరపై తొలిసారి 6 ప్యాక్‌లో కనిపించిన హీరో అల్లు అర్జున్. ‘దేశముదురు’ సినిమాలో మనకు తొలిసారి అలా దర్శనమిచ్చాడు బన్నీ. ఆ తర్వాత చాలామంది హీరోలు 6 ప్యాక్ బాడీతో కనిపించి ఆకట్టుకున్నారు. ఆఖరుకు కమెడియన్ అయిన సునీల్ సైతం హీరోగా మారాక ‘పూలరంగడు’లో కండల తిరిగిన దేహంతో కనిపించి ‘ఔరా’ అనిపించాడు. ఇప్పుడు తొలిసారి అఖిల్ 8 ప్యాక్ బాడీతో ప్రేక్షకులకు కనిపించనున్నాడు. ‘మిస్టర్ మజ్ను’ టైటిల్ సాంగ్‌లో తాను 8 ప్యాక్ బాడీతో కనిపిస్తానని చెప్పాడు. ఆ పాట కొరియోగ్రాఫర్ శేఖర్ సూచన మేరకే అలా చేశానని తెలిపాడు. ఎడిటింగ్ పరంగా కూడా ఆ పాట ప్రత్యేకంగా ఉంటుందని అఖిల్ తెలిపాడు. ఏదేమైనా ఒక పాట కోసం అంత కష్టపడ్డం చూస్తే అఖిల్ ఎంత ప్రొఫెషనల్‌గా ఉన్నాడో అర్థమవుతుంది.