Is RGV Releasing ‘Lakshmi’s NTR’ Trailer?


Is RGV Releasing 'Lakshmi's NTR' Trailer?

ఆర్జీవీ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ టీజర్ రిలీజ్ చేయబోతున్నారా..?

ఆర్జీవీ ఈ రోజు సాయంత్రం 5 గంటలకు ఎలాంటి సంచలనం సృష్టించబోతున్నారు? దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరావు వర్ధంతి రోజున ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ టీజర్ రిలీజ్ చేయబోతున్నారా..? లేదా ఎన్టీఆర్ లుక్ రివీల్ చేయబోతున్నారా..? లేదా ఏదైనా సంచలన ప్రకటన  చేయబోతున్నారా..? ఇప్పటికే కొన్ని పాటలు, లక్ష్మీపార్వతి, చంద్రబాబుల  లుక్‌లు విడుదల చేసి కొంచెం హడావుడి చేశారు ఆర్జీవీ. తాజాగా ఆయన చేసిన ట్వీట్ ఈ హడావుడిని మరింత పెంచాయి. నిన్న రాత్రి ఆర్జీవీ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. ఈ ట్వీట్‌‌కు  కామెంట్లు కూడా ఓ రేంజ్‌లో వస్తున్నాయి.

ఎన్టీఆర్‌ జీవిత చరిత్రపై.. ఎవరు ఎన్ని సినిమాలు తీసినా.. తను తీసేదే అసలయిన జీవిత చరిత్ర అని.. పై లోకంలో ఉన్న అన్నగారికి కూడా తను తీస్తున్న “లక్ష్మీస్ ఎన్టీఆర్” సినిమాయే నచ్చుతుందని ఇదివరకే ఆర్జీవీ ప్రకటించారు.

అసలు ఆ ట్వీట్ ఏం చెబుతోంది…
“రామారావు గారి వర్దంతి సందర్భంగా అనగా జనవరి 18న సాయంత్రం 5గంటలకు మా ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమా జీవం పోసుకోబోతుంది”. ఇది ఆర్జీవీ ట్వీట్ సారాంశం. ఆయన ప్రకటన అసలు ఉదేశ్యం తెలుసుకోవాలంటే మాత్రం సాయంత్రం వరకు వేచి చూడాల్సిందే.