Jersey: Teaser On Jan 12


Jersey: Teaser On Jan 12

జెర్సీ: జనవరి 12న టీజర్ వస్తోంది

నాని కథానాయకుడిగా ‘మళ్లీ రావా’ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘జెర్సీ’. ఇందులో నాని క్రికెటర్‌గా కనిపించనున్నాడు. శ్రద్ధా శ్రీనాథ్ నాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు.

స్పోర్ట్స్ డ్రామాగా తయారవుతున్న ఈ చిత్రానికి అనిరుధ్ రవిచంద్రన్ సంగీత దర్శకుడు. కాగా ఈ సినిమా టీజర్‌ను జనవరి 12న ఆవిష్కరించనున్నారు. ఈ విషయాన్ని తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా నాని తెలియజేశాడు. ఏప్రిల్‌లో ‘జెర్సీ’ ప్రేక్షకుల ముందుకు రానున్నది.