Kajal To Pair Opposite Nithin?


Kajal To Pair Opposite Nithin?

నితిన్ జోడీగా కాజల్?

హీరోయిన్‌గా సీనియర్ అయిన కాజల్ అగర్వాల్ ఇప్పుడు ఇదివరకు పనిచేయని యువ హీరోలతో కలిసి పనిచేస్తూ, అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నారు. ఇటీవలే తనకంటే చాలా చినవాడైన బెల్లంకొండ సాయిశ్రీనివాస్ జోడీగా ‘కవచం’లో నటించిన ఆమె.. త్వరలో ఓ యువ హీరోతో తొలిసారి కలిసి నటించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆ హీరో.. నితిన్. ‘ఛలో’ సినిమాతో దర్శకుడిగా పరిచయమై మెప్పించిన వెంకీ కుడుముల దర్శకత్వంలో ఒక సినిమా చేసేందుకు నితిన్ సిద్ధమవుతున్నాడు. ఆ సినిమాలో నాయికగా కాజల్‌ను సంప్రదించినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందీ, లేనిదీ వెల్లడి కాలేదు.

ప్రస్తుతం నితిన్ కెరీర్ పరంగా టఫ్ ఫేజ్‌ను ఎదుర్కొంటున్నాడు. త్రివిక్రం డైరెక్షన్‌లో చేసిన ‘అ ఆ’ తర్వాత అతనికి మళ్లీ హిట్టు దక్కలేదు. మరోవైపు కాజల్ కూడా ఇటీవలి కాలంలో సరైన్ హిట్ లేదు. 2018 మొదట్లో వచ్చిన ‘అ!’ సినిమాలో చేసిన పాత్ర విమర్శకుల ప్రశంసల్ని అందుకున్నా, తర్వాత వచ్చిన ‘ఎంఎల్ఎ’, ‘కవచం’ సినిమాలు ఫ్లాపయ్యాయి. ఆమె ఆశలన్నీ బాలీవుడ్ హిట్ మూవీ ‘క్వీన్’ ఆధారంగా తమిళంలో రూపొందుతున్న ‘ప్యారిస్ ప్యారిస్’పైనే ఉన్నాయి. నితిన్‌తో చేయడానికి ఆమె ఒప్పుకుంటే, అది నిజంగా ఒక ఆసక్తికర కాంబినేషన్ అవుతుంది.