Kalki First Look Poster: Interesting Logo Design


Kalki First Look Poster: Interesting Logo Design

కల్కి ఫస్ట్ లుక్ పోస్టర్: ఆకట్టుకుంటున్న లోగో

డాక్టర్ రాజశేఖర్ టైటిల్ రోల్ చేస్తున్న ‘కల్కి’ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను కొత్త సంవత్సరం సందర్భంగా జనవరి 1న ఆవిష్కరించారు. దీంతో పాటు టైటిల్ లోగోనూ విడుదల చేశారు. ఫస్ట్ లుక్‌లో రాజశేఖర్ జీపులో కూర్చొని, ఒక కాలు బయట పెట్టి, కళ్లజోడుతో యంగ్ లుక్‌లో కనిపిస్తున్నారు. హీరో నాని నిర్మించిన ‘అ!’ చిత్రంతో దర్శకుడిగా పరిచయమైన ప్రశాంత్‌వర్మ ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నాడు. 1980ల నాటి నేపథ్యంతో తెరకెక్కుతుండటం ‘కల్కి’ సినిమాకు సంబంధించిన ఇంటరెస్టింగ్ పాయింట్. అందుకే పోస్టర్‌పై ‘హ్యాపీ న్యూ ఇయర్ 1983’ అని చెప్పడం గమనార్హం.

టైటిల్ లోగోను గోల్డ్ కలర్‌తో రూపొందించారు. అందులో కత్తులు, బాణాలు, ధనస్సులు, గండ్రగొడ్డళ్లు, వివిధ రాశులకు చెందిన చిహ్నాలు, శంఖుచక్రాలు, వేణువులు వంటివి ఉన్నాయి. ఈ చిత్రంలో ఒకరికి ముగ్గురు తారలు రాజశేఖర్ సరసన నటిస్తున్నారు. వాళ్లు.. అదాశర్మ, నదితాశ్వేత, స్కార్లెట్ విల్సన్. ఈ చిత్రంతో తన కెరీర్లో మరో హిట్ కొట్టడం గ్యారంటీ అనే నమ్మకంతో ఉన్నారు రాజశేఖర్.