Kona Venkat To Produce A Movie With Anushka And Madhavan


మాధవన్, అనుష్క జోడీతో కోన వెంకట్ సినిమా

మాధవన్, అనుష్క ప్రధాన పాత్రధారులుగా ఒక సినిమా రూపొందనున్నది. ఇందులో అంజలి, శాలినీ పాండే కీలక పాత్రలు పోషించనున్నారు. హాలీవుడ్ తారలు కూడా నటించే ఈ ‘క్రాస్-ఓవర్’ మూవీని కోన ఫిల్మ్ కార్పొరేషన్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బేనర్లపై కోన వెంకట్, టి.జి. విశ్వప్రసాద్ నిర్మించనున్నారు. ఇదివరకు మంచు విష్ణుతో ‘వస్తాడు నా రాజు’ చిత్రాన్ని రూపొందించిన హేమంత్ మధుకర్ ఈ చిత్రానికి దర్శకుడు. కోన వెంకట్, గోపి మోహన్ సంయుక్తంగా రచన చేస్తున్న ఈ సినిమాకు గోపి సుందర్ సంగీతాన్నీ, షానీల్ డియో సినిమాటోగ్రఫినీ, నీరజ కోన కాస్ట్యూం డిజైనింగ్‌నూ అందించనున్నారు. మార్చిలో ఈ సినిమా షూటింగ్ యు.ఎస్.లో మొదలవుతుందని నిర్మాతల్లో ఒకరైన కోన వెంకట్ తెలిపారు. ఈ విషయాన్ని ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.