Maharshi Release Date Postponed To April End

‘మహర్షి’ విడుదల ఎప్పుడు?
మహేశ్ కథానాయకుడిగా వంశీ పైడిపల్లి డైరెక్షన్లో రూపొందుతున్న సినిమా ‘మహర్షి’. సి. అశ్వనీదత్, దిల్ రాజు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో పూజా హెగ్డే నాయిక. ఈ సినిమా ఎప్పుడు విడుదల అవుతుందనేది ఆసక్తికరంగా మారింది. వాస్తవానికి ‘మహర్షి’ని ఏప్రిల్ 5న విడుదల చేస్తామని ఇదివరకు నిర్మాతలు ప్రకటించారు. అయితే తాజా అప్డేట్ ప్రకారం ఆ రోజు సినిమా విడుదలవడం లేదు. అందుకే నాగచైతన్య, సమంత జంటగా నటిస్తున్న ‘మజిలీ’ని ఆ రోజున విడుదల చేయడానికి ఆ చిత్ర నిర్మాతలు నిర్ణయించారు. ‘మహర్షి’ షూటింగ్ మార్చి నెలలో పూర్తవనున్నది. ఆ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ పనులకు కొంత సమయం తీసుకొని ఏప్రిల్ నెలాఖరున విడుదల చేసే ఉద్దేశంలో దర్శక నిర్మాతలున్నారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఏప్రిల్ 26న విడుదల చేయాలనేది వాళ్ల ఆలోచన. త్వరలో దీనిపై అధికారిక ప్రకటన వెలువడనున్నది. ఇందులో భిన్న గెటప్పుల్లో మహేశ్ కనిపించనున్నారు.