Manikarnika Controversy: Mishti’s Character Has Been Chopped Off


Manikarnika Controversy: Mishti's Character Has Been Chopped Off
Manikarnika Controversy: Mishti’s Character Has Been Chopped Off

‘మణికర్ణిక’లో నా పాత్రను కత్తిరించేశారు: మిష్టీ చక్రవర్తి

‘మణికర్ణిక’ వివాదంలో క్రిష్‌కు మద్దతు పెరుగుతోంది. ఆ సినిమాలో ఒక పాత్ర చేసిన మిష్టీ చక్రవర్తి ‘మణికర్ణిక’ సినిమాలో తనకు చెప్పిందొకటి, చేసిందొకటంటూ నిర్మాతలు, కంగనపై ఆరోపణలు చేసింది. మిష్టి తెలుగు ప్రేక్షకులకు పరిచితురాలే. ‘చిన్నదాన నీ కోసం’, ‘కొలంబస్’, ‘బాబు బాగా బిజీ’, ‘శరభ’ చిత్రాల్లో నాయికగా నటించింది. ‘బాలీవుడ్ హంగామా’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె తన పాత్రను పెంచుతున్నామంటూ అదనంగా కాల్షీట్లు తీసుకొని సన్నివేశాలు తీశారనీ, కానీ సినిమాలో కొత్తగా తీసినవి ఉంచి, అదివరకు తీసిన సన్నివేశాల్ని తీసేశారనీ చెప్పింది. “నిర్మాత కమల్ జైన్ నా పాత్రను పెంచామనీ, అందుకే కొత్తగా డేట్స్ కావాలనీ అడిగారు. సినిమా చూశాక కొత్తగా తీసిన సీన్లు మాత్రమే ఉంచి, ముఖ్యమైన పాత సీన్లు తీసేశారని అర్థమైంది. రీషూట్ చేయాలనుకున్నారు. అందుకే మునుపు తీసిన సీన్లు తీసేసి, కొత్తగా తీసినవి వాటికి అనుగుణంగా మ్యాచ్ చేశారు. కంగన నాకు ‘నీది నా చెల్లెలి తరహా కేరెక్టర్. ఇలా వచ్చి అలా పోయేది కాదు’ అని చెప్పింది. హఠాత్తుగా ఒక రోజు అక్కడ క్రిష్ లేడని తెలిసింది. నేను షాకయ్యాను. ‘మణికర్ణిక’ నుంచి సోనూ సూద్ వెళ్లిపోయాక, నేను డౌటు పడ్డాను. ఎందుకంటే ఒక గుర్తింపు ఉన్న సినిమాలో గుర్తింపులేని పాత్ర చేయాల్సిన అవసరం నాకు లేదు. సినిమా చూశాక నా కేరెక్టర్ ఆబ్సెంట్ అయ్యిందనిపించింది. ఆ పాత్రను కత్తిరించేశారు” అంటూ ఆమె ఆరోపణలు గుప్పించింది.