Manikarnika Saga: Krish’s Name Appears After Kangana In The Credits


Manikarnika Saga: Krish's Name Appears After Kangana In The Credits

మణికర్ణిక: టైటిల్స్‌లో కంగన తర్వాతే క్రిష్ పేరు

‘మణికర్ణిక: ద క్వీన్ ఆఫ్ ఝాన్సీ’ సినిమాకు సంబంధించి చాలా రోజులుగా అసలు దర్శకుడు క్రిష్ జాగర్లమూడిని ఉద్దేశపూర్వకంగా విస్మరిస్తున్నారని చెప్పుకుంటున్నారు. సినిమాలో టైటిల్ రోల్ చేసిన కంగనా రనౌత్ అంతా తానే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. తనకు అప్పగించిన స్క్రిప్ట్ ప్రకారం సన్నివేశాలన్నింటినీ తీసిన తర్వాతనే ఎన్టీఆర్ బయోపిక్ దర్శకత్వ బాధ్యతల్ని చేపట్టానని క్రిష్ చెప్పారు. అయితే ఆ తర్వాత కంగన స్వయంగా కొన్ని యుద్ధ సన్నివేశాలను డైరెక్ట్ చేశారు. కాగా సినిమా పోస్టర్లలోనూ, ట్రైలర్‌లోనూ దర్శకులుగా వాళ్లిద్దరి పేర్లూ కనిపించాయి. మొదట రాధాకృష్ణ జాగర్లమూడి పేరు, తర్వాత కంగన పేరూ ఉన్నాయి. కానీ ఇప్పుడు కథ మారింది.

విడుదలకు ఒక రోజు ముందు ముంబైలో వేసిన స్క్రీనింగ్‌లో పేర్ల స్థానాలు తారుమారయ్యాయి. పైన కంగన పేరు, కింద క్రిష్ పేరూ రావడం చూసినవాళ్లంతా అవాక్కయ్యారు. అయితే ఇది ఊహించినదేనని కొంతమంది అంటున్నారు. క్రిష్ సహా అనేకమందిని ఈ చర్య షాక్‌కు గురిచేసేదే అయినా, దీనిపై మిశ్రమ స్పందనలు వ్యక్తమవుతున్నాయి. ఇది డైరెక్టర్‌గా క్రిష్‌ను అగౌరవపరచడం, అవమానించడంగా చాలామంది భావిస్తున్నారు. అయితే ‘మణికర్ణిక’కు ఇంత క్రేజ్ రావడానికి ఏకైక కారణం కంగనే కాబట్టి టైటిల్స్‌లో ఆమె పేరు ముందు ఉండటంలో తప్పేమీ లేదని ఆమెను వెనకేసుకొస్తున్నారు.