Nikhil Follows Balaiah!

బాలయ్య రూట్లో నిఖిల్!
Nikhil Follows Balaiah!
ప్రస్తుతం జర్నలిజం, ఫేక్ సర్టిఫికేట్స్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతోన్న ‘ముద్ర’ చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు నిఖిల్. ఈ సినిమా తర్వాత అతను ఓ సైన్స్ ఫిక్షన్ మూవీలో నటించబోతున్నాడని సమాచారం. బాలకృష్ణ హీరోగా సింగీతం శ్రీనివాసరావు తెరకెక్కించిన సైన్స్ ఫిక్షన్ మూవీ ‘ఆదిత్య 369’. ఈ సినిమా టైమ్ మిషన్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కింది. సంచలన విజయాన్ని సాధించింది. ఇప్పుడు టైమ్ మిషన్ కాన్సెప్ట్‌లోనే నిఖిల్ సినిమా చేయబోతున్నాడట. గత ఏడాది ‘టాక్సీవాలా’ చిత్రంతో సక్సెస్ అందుకున్న దర్శకుడు రాహుల్ సాంకృత్యాయన్ టైమ్ మిషన్ నేపథ్యంలో కథను రెడీ చేసి నిఖిల్‌కు వినిపిస్తే.. నిఖిల్ సినిమా చేయడానిక రెడీ అన్నాడని ఫిలింనగర్ వర్గాల సమాచారం. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియనున్నాయి.