No Censor Cuts To NTR: Kathanayakudu


No Censor Cuts To NTR: Kathanayakudu

‘యన్.టి.ఆర్: కథానాయకుడు’కు ఒక్క సెన్సార్ కట్ లేదు

నందమూరి బాలకృష్ణ టైటిల్ రోల్ పోషించిన ‘యన్.టి.ఆర్: కథానాయకుడు’ చిత్రానికి సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తయ్యాయి. ఒక్క కట్ లేకుండా సెన్సార్ బోర్డ్ క్లీన్ ‘యు’ సర్టిఫికెట్ అందించింది. దివంగత మహానటుడు ఎన్టీఆర్ బయోపిక్‌లో భాగంగా వస్తున్న ఈ తొలి చిత్రం జనవరి 9న భారీ స్థాయిలో విడుదలవుతోంది. క్రిష్ జాగర్లమూడి డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో బాలకృష్ణ జోడీగా విద్యాబాలన్ నటించారు. రానా, కల్యాణ్‌రాం, దగ్గుబాటి రాజా, వెన్నెల కిశోర్, మంజిమా మోహన్, పూనం బజ్వా కీలక పాత్రలు పోషించగా, సుమంత్, ప్రకాశ్‌రాజ్, బ్రహ్మానందం, రకుల్‌ప్రీత్, నిత్యా మీనన్, శ్రియ, ప్రణీత, హన్సిక, షాలినీ పాండే అతిథి పాత్రల్లో కనిపించనున్నారు.