NTR Kathanayakudu: Balakrishna’s Phenomenal Feat


NTR Kathanayakudu: Balakrishna's Phenomenal Feat

చెరగని బాలకృష్ణ ఆకర్షణ శక్తి

బాలకృష్ణ ‘సాహసమే నా జీవితం’తో హీరోగా పరిచయమై 34 సంవత్సరాలు గడిచిపోయాయి. ఒక ఉద్యోగి అయితే అంత సర్వీస్ తర్వాత రిటైర్ అవుతారు. కానీ బాలకృష్ణ విషయంలో అది రివర్స్ అవుతున్నట్లు కనిపిస్తోంది. ఇప్పుడే ఆయన ఫుల్ ఫాంలో ఉన్న ఆటగాడిలా మహోత్సాహంతో పని చేసుకు పోతున్నారు.

2004లో వచ్చిన ‘లక్ష్మీ నరసింహా’ తర్వాత వరుస ఫ్లాపులు ఎదుర్కొన్నప్పుడు ఆయన కెరీర్ ముగిసిపోయిందనే అనుకున్నారు. విజయం కోసం ఆయన ఏకంగా ఆరేళ్ల కాలం ఎదురు చూడాల్సి వచ్చింది. 2010లో వచ్చిన ‘సింహా’తో ఆయన జూలు విదిల్చారు.

2014లో ‘లెజెండ్’తో ఆయన మరోసారి అందర్నీ ఆశ్చర్యపరిచారు. ఆ సినిమా రూ. 39 కోట్లు వసూలు చేయడమే కాకుండా ఒక థియేటర్‌లో ఏకంగా వెయ్యి రోజులు ప్రదర్శితమై రికార్డ్ సృష్టించింది. 2017లో వచ్చిన ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ సినిమా రూ. 49.75 కోట్లను వసూలు చేసి, బాలకృష్ణలో ప్రేక్షకాకర్షణ శక్తి పెరిగిందే తప్ప తగ్గలేదని నిరూపించింది.

ఇప్పుడు మరింత గొప్పగా ‘యన్.టి.ఆర్: కథానాయకుడు’ సినిమా విడుదలకు ముందు రూ. 71.5 కోట్ల బిజినెస్ చేసి ఆయన ఆకర్షణ శక్తి ఎలాంటిదో తెలియజేసింది. ఆ సినిమా ఎన్టీఆర్ జీవిత కథ కాబట్టి, ఆయన సమ్మోహన శక్తి తోడయ్యిందనేది నిజం. దాంతో పాటు ఎన్టీఆర్ పాత్రను బాలకృష్ణ గొప్పగా పోషించి ఉంటారని నమ్మడం వల్లా, ఆయనను చూడ్డానికి జనం బారులు తీరతారని నమ్మడం వల్లా బయ్యర్లు ఆ సినిమా హక్కుల్ని ఆ స్థాయిలో కొన్నారు.

అంటే ఏమిటి? ప్రస్తుతం బాలకృష్ణ కెరీర్ పదేళ్ల క్రితం నాటి కంటే మరింత మెరుగైన స్థితిలో ఉంది. మరింత దూకుడుగానూ ఉంది. ఫిబ్రవరి 7న ‘యన్.టి.ఆర్: మహానాయకుడు’తో ఆయన మరోసారి ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఎన్టీఆర్ ఒక చరిత్ర. ఈ రెండు సినిమాలూ అదే రకంగా చరిత్ర సృష్టించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. వాటితో పాటు బాలకృష్ణ కూడా…