NTR Kathanayakudu: Crashes In US


NTR Kathanayakudu: Crashes In US

యన్.టి.ఆర్. కథానాయకుడు: యు.ఎస్.లో కలెక్షన్లు పడిపోయాయ్!

నందమూరి బాలకృష్ణ టైటిల్ రోల్ పోషించిన ‘యన్.టి.ఆర్. కథానాయకుడు’ సినిమా వసూళ్లు యు.ఎస్. బాక్సాఫీస్ వద్ద భారీగా పడిపోయాయ్. ఎన్టీఆర్ బయోపిక్‌లో తొలి భాగంగా క్రిష్ డైరెక్షన్‌లో రూపొందిన ఈ సినిమా యు.ఎస్.లో ఐదో రోజు 105 వేల డాలర్లను మాత్రమే వసూలు చేసింది. దాంతో ఐదు రోజుల్లో ఆ సినిమా సాధించిన మొత్తం వసూళ్లు 815 వేల డాలర్లకు చేరుకున్నాయి. అంచనాలకు ఈ గణాంకాలు బహు దూరంగా ఉండటం గమనార్హం. ప్రస్తుత సరళి చూస్తుంటే అక్కడ ఈ సినిమా బ్రేకీవెన్ సాధించడం చాలా కష్టమని విశ్లేషకులు చెబుతున్నారు. యు.ఎస్.లో బాలకృష్ణ మునుపటి సినిమాలు ‘గౌతమిపుత్ర శాతకర్ణి’, ‘జై సింహా’ మంచి వసూళ్లు సాధించాయి. వాటి స్థాయిలో ‘యన్.టి.ఆర్: కథానాయకుడు’ వసూళ్లను సాధించలేకపోతోంది. సినిమాలో ఉత్కంఠభరిత కథనం లేకపోవడమే దీనికి కారణం.