NTR Mahanayakudu: When Will The Trailer Be Released?


NTR Mahanayakudu: When Will The Trailer Be Released?
NTR Mahanayakudu: When Will The Trailer Be Released?

యన్.టి.ఆర్: మహానాయకుడు: ఫిబ్రవరి 14న వచ్చేనా?

ఎన్టీఆర్ బయోపిక్‌లో మొదటి భాగం ‘యన్.టి.ఆర్: మహానాయకుడు’ జనవరి 9న వచ్చింది, వెళ్లింది. ఆ సినిమా ప్రజలను ఏమాత్రం ఆకర్షించలేకపోయింది. రెండో భాగమైన ‘యన్.టి.ఆర్: మహానాయకుడు’ ఫిబ్రవరి 14న వస్తుందని చెప్పారు. కానీ ఇప్పటివరకు ఆ సినిమాకు సంబంధించి ఎలాంటి ప్రచారాన్నీ నిర్మాతలు మొదలు పెట్టకపోవడంతో ఆ తేదీన సినిమా విడుదల ఉందా? లేదా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిజానికి తొలుత దీన్ని జనవరి 24న విడుదల చేయాలనుకున్నారు. తర్వాత తొలి భాగం వచ్చిన 15 రోజులకే రెండో భాగం తీసుకు రావడం సరికాదనుకొని, విడుదల తేదీని ఫిబ్రవరి 7కు జరిపారు. ఆ తర్వాత ఆ తేదీని కూడా మార్చేసి, ఫిబ్రవరి 14న వస్తుందని చెప్పారు. అదే ఖాయమనుకుంటే ఇంకా పదహారు రోజుల సమయమే ఉంది. ఈ సరికి ప్రచారం ఊపందుకోవాలి. కానీ పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. అయితే త్వరలోనే ‘మహానాయకుడు’కు సంబంధించిన ట్రైలర్‌ను విడుదల చేస్తారని వినిపిస్తోంది. దాని ద్వారా ప్రేక్షకుల్లో సినిమాపై ఆసక్తిని కలిగించాలని బాలకృష్ణ, క్రిష్ ప్లాన్ చేస్తున్నారని సమాచారం. ఈ రెండో భాగం రాజీయాలకు సంబంధించింది కావడం వల్ల ప్రేక్షకుల్లో ఉత్కంఠను పెంచే సీన్లతో ట్రైలర్‌ను కట్ చేసి, విడుదల చేయనున్నారు. ఇందులో ఎన్టీఆర్ పాత్రతో పాటు నాదెండ్ల భాస్కరరావు, చంద్రబాబు, హరికృష్ణ, బసవతారకం పాత్రలకు ఎక్కువ స్కోప్ ఉంది. ఆ పాత్రల్లో సచిన్ ఖడేకర్, రానా, కల్యాణ్ రాం, విద్యాబాలన్ కనిపించనున్నారు.