Official: Shraddha Srinath Is Doing The Pink Remake


Official: Shraddha Srinath Is Doing The Pink Remake
Official: Shraddha Srinath Is Doing The Pink Remake

తమిళ ‘పింక్’లో శ్రద్ధ!

Official: Shraddha Srinath Is Doing The Pink Remake

బాలీవుడ్‌లో హిట్టయిన ‘పింక్’ సినిమా తమిళంలో రీమేక్ అవుతున్న విషయం తెలిసిందే. ఒరిజినల్‌లో అమితాబ్ బచ్చన్ చేసిన లాయర్ కేరక్టర్‌ను తమిళంలో అగ్ర నటుడు అజిత్ చేస్తున్నాడు. హెచ్. వినోద్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా ద్వారా బోనీ కపూర్‌కు చెందిన బేవే ప్రాజెక్ట్స్ ఎల్ఎల్‌పీ సంస్థ తమిళ సినిమాల్లోకి అడుగుపెడుతోంది. కాగా ఇందులో ఒక నాయికగా శ్రద్ధా శ్రీనాథ్ ఎంపికైంది. “ఇది అఫిషియల్” అంటూ స్వయంగా శ్రద్ధ తన ట్విట్టర్ పేజీ ద్వారా తెలిపింది. అజిత్ సార్‌తో సినిమా చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉందనీ, ఇప్పటివరకు తాను చేసిన పాత్రలన్నింటి కంటే ఇది మోస్ట్ ఛాలెంజింగ్ రోల్ అని నమ్మకంతో చెబ్తున్నాననీ ఆమె చెప్పింది. కొద్ది రోజులుగా తాను ఈ సినిమా చేయబోతున్నానంటూ మీడియాలో రూమర్లు వస్తున్నాయనీ, ఇప్పుడు ఆ రూమర్లు నిజమవడం సంతోషంగా ఉందనీ పోస్ట్ చేసింది శ్రద్ధ. అయితే ఆమె ముగ్గురు నాయికల్లో ఏ పాత్రను చేస్తోందీ తెలుపలేదు. ‘పింక్’లో తాప్సీ, కీర్తి కుళరి, ఆండ్రియా తరియాంగ్ నాయికలుగా నటించారు. బహుశా తాప్సీ పాత్రను శ్రద్ధ చేసే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. యువన్‌శంకర్ రాజా సంగీతం సమకూరుస్తున్న ఈ సినిమాకు నీరవ్ షా సినిమాటోగ్రాఫర్. ప్రస్తుతం శ్రద్ధ తెలుగులో నానితో ‘జెర్సీ’ సినిమా చేస్తోంది.