Prabhas To Dance With Les Twins!


Prabhas To Dance With Les Twins!

సాహో: లెస్ ట్విన్స్‌తో డాన్స్ చేయనున్న ప్రభాస్!

లెస్ ట్విన్స్‌గా పేరుపొందిన లారెంట్ నికొలస్, లారీ నికొలస్ ‘సాహో’లోని ఒక పాటలో హీరో ప్రభాస్‌తో కలిసి డాన్స్ చేయనున్నారు. ఇంటర్నేషనల్ సింగర్స్ బియాన్స్, మిస్సీ ఇలియట్‌లకు బ్యాకప్ డాన్సర్స్‌గా లెస్ ట్విన్స్ ప్రసిద్ధులు. మన ఫైట్ మాస్టర్లు రాం-లక్ష్మణ్ తరహాలోనే ఆ ఇద్దరూ చూపులకు ఒకే విధంగా కనిపిస్తారు. ‘సాహో’లో ఒక పాటను భారీ బడ్జెట్‌తో చిత్రీకరించేందుకు దర్శకుడు సుజిత్ ప్లాన్ చేశాడు. బాలీవుడ్ కొరియోగ్రాఫర్ వైభవి మర్చంట్ ఈ పాటకు కొరియోగ్రఫీ అందించనున్నారు. భిన్న విదేశీ నృత్య రీతులతో ఈ పాటను ఆమె కంపోజ్ చేస్తున్నారు. అందులో భాగంగా లెస్ ట్విన్స్ డాన్స్ చేయనున్నారు. ఈ పాట కోసం మ్యూజిక్ డైరెక్టర్ల త్రయం శంకర్-ఎహ్సాన్-లాయ్ ఫాస్ట్ బీట్‌తో మ్యూజిక్‌ను కంపోజ్ చేసినట్లు సమాచారం. డబుల్ ఏజెంట్‌గా ప్రభాస్ కనిపించే ఈ సినిమాలో శ్రద్ధా కపూర్ నాయిక. ఆగస్ట్ 15న ‘సాహో’ను విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.