Ram And Puri’s ‘ISmart Shankar’: Shoot Begins


Ram And Puri's 'ISmart Shankar': Shoot Begins

‘ఇస్మార్ట్ శంకర్’ షురూ చేసిండ్రు!

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని కాంబినేషన్‌లో ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమా ఈ రోజు (బుధవారం) లాంఛనంగా ప్రారంభమైంది. సహా నిర్మాత, నటి ఛార్మీ క్లాప్ కొట్టి ఈ చిత్రాన్ని ప్రారంభించారు. ప్రముఖ నిర్మాత స్రవంతి రవికిషోర్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. గురువారం నుంచి ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభం కానుంది.

ఈ సినిమాలో రామ్ న్యూ లుక్‌లో కనిపించబోతున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రారంభోత్సవం సందర్భంగా రామ్ సరికొత్త హెయిర్ స్టైల్, గడ్డంతో కనిపించాడు. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తుండగా రాజ్ తోట సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. పూరి జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని త్వరగా చిత్రీకరించి, మేలో రిలీజ్ చేయాలని చూస్తున్నారు. డబుల్ దిమాక్‌ అనే ట్యాగ్‌ లైన్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాతో పూరి కంబ్యాక్‌ సినిమాగా నిలుస్తుందని ఆశిద్దాం.

Ram And Puri's 'ISmart Shankar': Shoot Begins