Ram As ‘iSmart Shankar’


Ram As 'iSmart Shankar'

‘ఇస్మార్ట్ శంకర్’గా రామ్! 

రామ్ హీరోగా పూరి జగన్నాథ్ రూపొందిస్తున్న చిత్రానికి ‘ఇస్మార్ట్ శంకర్’ అనే టైటిల్ ఖరారు చేశారు. టైటిల్ లోగోతో పాటు, రామ్ కేరక్టర్ ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు.ఇస్మార్ట్ శంక‌ర్ పాత్ర‌లో రామ్ న‌టిస్తున్నాడు. ఫ‌స్ట్ లుక్ చాలా ఆస‌క్తిక‌రంగా ఉంది. రామ్ ఇందులో త‌ల‌కిందులుగా సిగ‌రెట్ తాగుతూ కనిపిస్తున్నాడు. ఈ చిత్రం కోసం పూర్తిగా మేకోవ‌ర్ అయ్యాడు రామ్.

జ‌న‌వ‌రిలోనే రెగ్యుల‌ర్ షూటింగ్ మొద‌లు కానుంది. వీలైనంత త్వ‌ర‌లో సినిమాకు సంబంధించిన కాస్ట్ అండ్ క్ర్యూ వివ‌రాలు తెల‌ప‌నున్నారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. ‘ఇస్మార్ట్ శంక‌ర్’ సినిమాను పూరీ క‌నెక్ట్స్ స‌హ‌కారంతో పూరీ జ‌గ‌న్నాథ్ టూరింగ్ టాకీస్ బ్యాన‌ర్ పై పూరీ జ‌గ‌న్నాథ్, ఛార్మి కౌర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.