Ravi Teja’s Film: Title To Be Revealed On 26th January


Ravi Teja's Film: Title To Be Revealed On 26th January

రవితేజ సినిమా టైటిల్ తెలిసేది ఆ రోజే

రవితేజ కొత్త సినిమా టైటిల్‌కు ముహూర్తం కుదిరింది. జనవరి 26న రిపబ్లిక్ డేతో పాటు రవితేజ పుట్టినరోజు సందర్భంగా టైటిల్‌ను ప్రకటిస్తారు. దాంతో పాటు లోగోనూ ఆవిష్కరిస్తారు. ఈ చిత్రాన్ని ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’, ‘ఒక్క క్షణం’ చిత్రాల దర్శకుడు వి.ఐ. ఆనంద్ రూపొందించనున్నాడు. ఎస్ఆర్‌టి ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై రాం తాళ్లూరి ఈ సినిమాని నిర్మిస్తున్నారు. త్వరలోనే తొలి షెడ్యూల్‌ని ప్రారంభిస్తామని ఆయన తెలిపారు. ఇందులో రవితేజ సరసన ముగ్గురు నాయికలు కనిపిస్తారు. ఒక నాయికగా ‘ఆర్ఎక్స్ 100’ ఫేం పాయల్ రాజ్‌పుట్ ఎంపికైంది. మరో ఇద్దరు నాయికల ఎంపిక జరుగుతోంది. బాబీ సింహా, వెన్నెల కిశోర్, సత్య ఇంతవరకు ఎంపికైన తారాగణం. తమన్ స్వరాలు కూరుస్తున్న ఈ చిత్రానికి సాయి శ్రీరాం సినిమాటోగ్రాఫర్.