Samantha And Sharwanand Come Together For 96 Remake


Samantha And Sharwanand Come Together For 96 Remake

సమంత, శర్వానంద్ జోడీ

తమిళంలో త్రిష, విజయ్ సేతుపతి జంటగా నటించిన ’96’ సినిమా ఘన విజయం సాధించింది. ఇప్పుడు ఆ సినిమా తెలుగులో రీమేక్ కాబోతోంది. తెలుగులో సమంత, శర్వానంద్ జంటగా నటించబోతున్నారు. తమిళ ఒరిజినల్‌ను డైరెక్ట్ చేసిన సి. ప్రేంకుమార్ తెలుగు వెర్షన్‌నూ రూపొందించనున్నాడు. దిల్ రాజు నిర్మించే ఈ సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. ’96’ అనేది రాం, జానకి అనే ఇద్దరు చిన్ననాటి క్లాస్‌మేట్ల కథ. స్నేహం ప్రేమగా చిగురించాక తప్పనిసరి పరిస్థితుల్లో విడిపోయిన ఆ ఇద్దరూ కొన్నేళ్ల తర్వాత పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో కలుసుకున్నాక ఏం జరిగిందనేది అత్యంత ఆసక్తికరంగా, భావోద్వేగపూరితంగా ప్రేంకుమార్ చిత్రించాడు. వర్తమాన, భూత కాలాల్లో నడిచే ఈ సినిమా కథ ప్రేక్షకుల హృదయాలపై చెరగని ముద్ర వేస్తుందనే నమ్మకంతో దిల్ రాజు తెలుగులో రీమేక్ చేసేందుకు నిర్ణయించుకున్నారు. ఆ పాత్రల్లో సమంత, శర్వానంద్ ఎలా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటారో చూడాలి.