Sara Ali Khan’s Broke Up Story!


Sara Ali Khan's Broke Up Story!
Sara Ali Khan’s Broke Up Story!

సారా అలీఖాన్ బ్రేకప్!

అమృతా సింగ్, సైఫ్ అలీఖాన్ కుమార్తె సారా అలీఖాన్‌కూ ఒక ప్రేమకథ ఉంది. అయితే ఆ కథ ఎక్కువ కాలం నడవకుండానే ముగిసిపోయింది. ఇంతకీ ఆమె ప్రేమలో పడింది మాజీ కేంద్రమంత్రి సుశీల్‌కుమార్ షిండే మనవడు వీర్ పహారియాతో. ఈ విషయాన్ని ఫిలింఫేర్ మ్యాగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె వెల్లడించింది. “నేను డేటింగ్ చేసింది అతనొక్కడితోనే. నా జీవితంలో మరో బాయ్‌ఫ్రెండ్ లేడు” అని తెలిపింది సారా. “అది భగ్న ప్రేమా?” అనడిగితే, “అతను నా మనసునేమీ విరిచేయలేదు. నా హృదయం పగల్లేదు. అదంతా సవ్యంగానే జరిగిపోయింది. ప్రామిస్” అని స్పష్టం చేసింది. 2016లో సారా, వీర్ ప్రేమలో పడ్డారు. కొంత కాలం డేటింగ్ చేశారు. కానీ అప్పట్లో ఆ విషయాన్ని గోప్యంగానే ఉంచారు. అయితే ఏడాది తర్వాత ఇద్దరూ విడిపోయారు. ప్రస్తుతం తాను సింగిల్‌గానే ఉన్నాననీ, ఎవరితోనూ డేటింగ్‌లో లేననీ తెలిపింది సారా. ‘కేదార్‌నాథ్’ సినిమాతో నిరుడు బాలీవుడ్‌లో పరిచయమైన ఆమెకు రెండో సినిమా ‘సింబా’ బ్లాక్‌బస్టర్‌ను ఇచ్చింది. ఇందులో ఆమె రణ్‌వీర్ సింగ్ జోడీగా బాగా ఆకట్టుకుంది.

Sara Ali Khan's Broke Up Story!
Sara Ali Khan’s Broke Up Story!