Sita: Payal Rajput To Shake A Leg In A Special Number


Sita: Payal Rajput To Shake A Leg In A Special Number
Sita: Payal Rajput To Shake A Leg In A Special Number

‘సీత’లో పాయల్ స్పెషల్!

Sita: Payal Rajput To Shake A Leg In A Special Number

తేజ దర్శకత్వంలో ‘సీత’గా కాజల్ అగర్వాల్ నటిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా నటిస్తున్నాడు. అతనితో కాజల్ వరుసగా రెండో సినిమా చేస్తుండటం గమనార్హం. గత ఏడాది ఆ ఇద్దరూ జంటగా ‘కవచం’లో కనిపించారు. దర్శకుడు తేజ ‘నేనే రాజు నేనే మంత్రి’ లాంటి సూపర్ హిట్ సినిమా తర్వాత  వైవిధ్యమైన కథతో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాడు. కాజల్‌తో ఆయనకి ఇది మూడో సినిమా. ఇదివరకు ‘లక్ష్మీ కల్యాణం’, ‘నేనే రాజు నేనే మంత్రి’ సినిమాల్లో ఆమెతో కలిసి పనిచేశాడు. షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ సినిమాలో సోనూ సూద్, మన్నారా చోప్రా మరో రెండూ కీలక పాత్రలు చేస్తున్నారు. కాగా ఇందులో ఒక స్పెషల్ సాంగ్ కోసం ‘ఆర్ఎక్స్ 100’ నాయిక పాయల్ రాజ్‌పుట్ కోసం నిర్మాతలు సంప్రదించారనీ, ఆమె గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చిందనీ సమాచారం. అనూప్ రూబెన్స్ సంగీతం సమకూర్చిన ఆ సాంగ్‌లో హీరో బెల్లంకొండ శ్రీనివాస్‌తో కలిసి పాయల్ స్టెప్పులేయనుంది. త్వరలోనే ఈ పాటను చిత్రీకరించేందుకు తేజ ప్లాన్ చేస్తున్నాడు. ‘ఆర్ఎక్స్ 100’లో హీరోను సెడ్యూస్ చేసి మరీ అతడిని ప్రేమలో దింపే కేరెక్టర్‌లో పాయల్ అమోఘంగా రాణించింది.