Tanish’s New Film Titled SARIHADDU


Tanish's New Film Titled SARIHADDU

సరిహద్దు: తనీశ్ కొత్త చిత్రం

‘రంగు’ తర్వాత ఈ సినిమా హీరో, దర్శకుల నుంచి మరో సినిమా రాబోతోంది. తనీశ్ హీరోగా, కార్తికేయ వి. దర్శకుడిగా ‘సరిహద్దు’ అనే సినిమా రూపొందనున్నది. ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా తనీశ్ తెలిపాడు. ఈ ఏడాది మార్చి 16 నుంచి షూటింగ్ జరుపుకొనే ఈ చిత్రాన్ని తెలుగు, హిందీ భాషల్లో నిర్మించనున్నారు. అందుకు తగ్గట్లే ఈ సినిమాలో తెలుగు, హిందీ భాషలకు చెందిన తారలు నటించనున్నారు. ఒక జాతీయ సమస్య నేపథ్యంలో ఈ సినిమా రూపొందనున్నది. ఈ చిత్రానికి సంబంధించిన మిగతా వివరాలను ఈ నెలాఖరుకు తెలియజేస్తామని తనీశ్ చెప్పాడు.