Vajra Kavachadhara Govinda First Look Out!

వజ్ర కవచధర గోవింద ఫస్ట్ లుక్ అదిరింది!
కమెడియన్‌గా రాణిస్తూ ‘సప్తగిరి ఎక్స్‌ప్రెస్’, ‘సప్తగిరి ఎల్ఎల్బీ’ చిత్రాలతో హీరోగా మారిన సప్తగిరి తాజాగా ‘వజ్ర కవచధర గోవింద’ అనే మరో సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ‘సప్తగిరి ఎక్స్‌ప్రెస్’ దర్శకుడు అరుణ్ పవార్ డైరెక్షన్లో శివ శివమ్ ఫిలింస్ పతాకంపై నరేంద్ర యెడల, జీవీఎన్ రెడ్డి ఈ చిత్రాన్నినిర్మిస్తున్నారు. కాగా, ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను ఈ రోజు (జనవరి 27) విడుదల చేసారు చిత్ర యూనిట్. అందులో సప్తగిరి సన్యాసి గెటప్ లో ఒక జీప్ పై కూర్చొని కనిపిస్తాడు.
”ఈ కథకు కరెక్ట్ టైటిల్ ఇది. ఇందులో సప్తగిరి పాత్ర పేరు గోవిందు. ఇతనొక ఫన్నీ దొంగ. ఇతనికో లక్ష్యం ఉంటుంది. ఆ లక్ష్య సాధన కోసం అతనేం చేశాడన్నదే ఈ సినిమా ప్రధాన కథాంశం. కడుపుబ్బా నవ్వించే అంశాలతోపాటు, మంచి యాక్షన్, ఎమోషన్, ఇతర వాణిజ్య అంశాలు కూడా ఇందులో బాగా కుదిరాయి. సప్తగిరి బాడీ లాంగ్వేజ్‌కి పర్ఫెక్ట్గా సూటయ్యే కథ ఇది” అని చెప్పారు అరుణ్ పవార్.
‘ఇప్పటికి మా ‘వజ్ర కవచధర గోవింద’ షూటింగ్ 80 శాతం పూర్తయింది. మిగిలిన సన్నివేశాలను కర్ణాటక లోని ఒక గుడిలో తెరకెక్కిస్తాం. మా చిత్రానికి చాలా కీలకమైన ఎపిసోడ్స్ ని 10 రోజుల పాటు ఈ దేవాలయంలో చిత్రీకరిస్తాం. మా చ₹సినిమా టైటిల్‌కి ఎక్స్ ట్రార్డినరీ రెస్పాన్స్ వచ్చింది. టైటిల్ ప్రకటించగానే మా సినిమాపై ఇండస్ట్రీలోనూ, ప్రేక్షకుల్లోనూ అటెన్షన్ బాగా పెరిగింది. మా ఈ సినిమా హిలేరియస్ యాక్షన్ ఎంటర్టైనర్.’ అని ఈ చిత్ర నిర్మాతలు నరేంద్ర యెడల , జీవీఎన్ రెడ్డి తెలిపారు.
వైభవీ జోషీ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో అర్చనా వేద, టెంపర్ వంశీ, అప్పారావు, అవినాష్, రాజేంద్ర జాన్ కొట్టోలి, వీరేన్ తంబిదొరై తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు . ఈ చిత్రానికి సంగీతం: విజయ్ బుల్గానిన్, కెమెరా: ప్రవీణ్ వనమాలి, ఎడిటింగ్: కిషోర్ మద్దాలి.