Valmiki Film Launched!


Valmiki Film Launched!

వరుణ్ తేజ్ వాల్మీకి ప్రారంభమయ్యింది!

మెగాప్రిన్స్‌ వరుణ్‌తేజ్‌ ‘వాల్మీకి’ చిత్ర ప్రారంభోత్సవం ఆదివారం (జనవరి 27) హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోలో జరిగింది. వరుణ్‌తేజ్‌పై చిత్రీకరించిన ఫస్ట్‌షాట్‌కు నిహారిక కొణిదెల క్లాప్‌ నివ్వగా, రామ్‌ బొబ్బ కెమెరా స్విచ్చాన్‌ చేశారు.

Valmiki Film Launched!
Valmiki Film Launched!

‘ఫిదా’, ‘తొలిప్రేమ’, ‘అంతరిక్షం’, ‘ఎఫ్2’.. వంటి విభిన్న చిత్రాలను ఎంచుకుంటూ విజయపథంలో దూసుకెళ్తున్నారు వరుణ్ తేజ్. తాజాగా 14 రీల్స్‌ ప్లస్‌ పతాకంపై పవర్‌ఫుల్‌ డైరెక్టర్‌ హరీష్‌ శంకర్‌ దర్శకత్వంలో రామ్‌ ఆచంట, గోపీ ఆచంట నిర్మిస్తున్న భారీ చిత్రం ‘వాల్మీకి’లో నటిస్తున్నారు. ఈ చిత్ర ప్రారంభోత్సవం ఆదివారం (జనవరి 27) హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోలో జరిగింది. వరుణ్‌తేజ్‌పై చిత్రీకరించిన ఫస్ట్‌షాట్‌కు నిహారిక కొణిదెల క్లాప్‌ నివ్వగా, రామ్‌ బొబ్బ కెమెరా స్విచ్చాన్‌ చేశారు. సెన్సేషనల్‌ డైరెక్టర్ వీవీ వినాయక్ గౌరవ దర్శకత్వం వహించగా ..  బ్రిలియంట్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ పూజా కార్యక్రమాలు నిర్వహించారు.

Valmiki Film Launched!
Valmiki Film Launched!

ఈ కార్యక్రమంలో నిర్మాత దిల్ రాజు, వరుణ్ తేజ్ తల్లి పద్మజ, నిర్మాత నవీన్ ఎర్నేని కూడా పాల్గొన్నారు. హీరోయిన్, ఇతర తారాగణం వివరాలు త్వరలో వెల్లడిస్తామని చిత్ర యూనిట్ తెలిపింది.

ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: అయనంకా బోస్‌, కథ: కార్తీక్‌ సుబ్బరాజ్‌, స్క్రీన్‌ప్లే: మధు, చైతన్య, ఆర్ట్‌: అవినాష్‌ కొల్ల, ఎడిటింగ్‌: ఛోటా కె.ప్రసాద్‌, ఫైట్స్‌: రామ్‌లక్ష్మణ్‌, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: హరీష్‌ కట్టా, నిర్మాతలు: రామ్‌ ఆచంట, గోపీ ఆచంట, మాటలు-దర్శకత్వం: హరీష్‌ శంకర్‌.

Valmiki Film Launched!
Valmiki Film Launched!

Varun Tej Next Film Titled Valmiki!