Varun Tej Next Film Titled Valmiki!

వరుణ్ తేజ్ తదుపరి చిత్రం వాల్మీకి!
వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్. ఇటీవలే ‘ఎఫ్2’ రూపంలో బ్లాక్‌బస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్న వరుణ్… వెంటనే తన తదుపరి చిత్రం వివరాలను ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఈ చిత్రానికి హరీశ్ శంకర్ దర్శకత్వం వహించబోతున్నారు. ఈ చిత్రం టైటిల్‌ను, కాన్సెప్ట్ పోస్టర్‌ను హరీశ్ సోషల్ మీడియా ద్వారా విడుదల చేశారు.

రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మించనున్న ఈ చిత్రానికి ‘వాల్మీకి’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. టైటిల్ లోగోలో ఉన్న తుపాకీ, సినిమా రీల్ చిత్రాలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఈ సినిమా తమిళంలో బ్లాక్‌బస్టర్ విజయం అందుకున్న ‘జిగర్తాండ’కు రీమేక్‌గా రాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నారు.