Vijay Devarkonda’s Untitled Film Shoot In Brisk Pace


Vijay Devarkonda's Untitled Film Shoot In Brisk Pace
Vijay Devarkonda’s Untitled Film Shoot In Brisk Pace

కొత్తగూడెంలో విజయ్ దేవరకొండ సినిమా షూటింగ్

బాక్సాఫీస్ వద్ద విజయం సాధించిన ‘టాక్సీవాలా’ సినిమా తర్వాత విజయ్ దేవరకొండ రెండు సినిమాలు చేస్తున్నాడు. ఒకటి ‘డియర్ కామ్రేడ్’, మరొకటి క్రాంతి మాధవ్ దర్శకత్వంలో చేస్తోన్న టైటిల్ ఖరారు కాని సినిమా. ప్రస్తుతం క్రాంతి మాధవ్ సినిమా షూటింగ్‌లో ఉన్నాడు విజయ్. కొత్తగూడెంలో దీని షూటింగ్ జరుగుతోంది. ఈ విషయం తెలిసి అక్కడికి అభిమానులు తరలి వచ్చారు. ఈ సినిమాలో విజయ్ సరసన ముగ్గురు తారలు.. రాశీ ఖన్నా, ఐశ్వర్యా రాజేశ్, ఐజాబెల్లే లీటే. వీరిలో ఐజాబెల్లే ‘మిస్టర్ మజ్ను’ చిత్రంలో కాలేజీ డీన్ కూతురిగా అఖిల్ సరసన కొద్దిసేపు కనిపించింది. అలెగ్జాండర్ వల్లభ నిర్మిస్తున్న ఈ చిత్రానికి గోపిసుందర్ సంగీతం అందిస్తున్నాడు. ఇటీవల విజయ్, ఐశ్వర్యలపై కొన్ని సన్నివేశాలను చిత్రీకరించారు. ఇందులో విజయ్ భిన్న దశలుండే ఆసక్తికరమైన కేరెక్టర్ చేస్తున్నట్లు సమాచారం.