Vinaya Vidheya Rama: Biggest Openings For Ram Charan


Vinaya Vidheya Rama: Biggest Openings For Ram Charan

వినయ విధేయ రామ: అదరగొట్టిన ఓపెనింగ్స్

రాంచరణ్ కథానాయకుడిగా బోయపాటి శ్రీను డైరెక్ట్ చేసిన ‘వినయ విధేయ రామ’ సినిమా తొలిరోజు కలెక్షన్లు అదరగొట్టాయి. చరణ్ కెరీర్‌లో అత్యధికంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ. 25.87 కోట్ల షేర్‌ను ఆ సినిమా వసూలు చేసింది. విశేషమేమంటే పెద్దదైన నైజాం ఏరియా కంటే, చిన్నదైన సీడెడ్‌లో ఎక్కువ షేర్ రావడం. నైజాంలో రూ. 5 కోట్లు వసూలైతే, సీడెడ్‌లో రూ. 7.15 కోట్లు వసూలు చేసిందని ట్రేడ్ విశ్లేషకులు తెలిపారు. విమర్శకుల నుంచి మిశ్రమ స్పందన వచ్చిన ఈ సినిమాకు పండగ సెలవులు ఏ మేరకు కలిసొస్తాయో చూడాలి. ఈ సినిమా ప్రి బిజినెస్ విలువ రూ. 76.60 కోట్లు.