Vinaya Vidheya Rama: ‘Thassadiyya’ Video Song Promo


Vinaya Vidheya Rama: 'Tassadiyya' Video Song Promo

వినయ విధేయ రామ: ‘తస్సాదియ్యా’ వీడియో సాంగ్

రాంచరణ్ కథానాయకుడిగా బోయపాటి శ్రీను రూపొందించిన ‘వినయ విధేయ రామ’ జనవరి 11న విడుదలవుతోంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చిన పాటలు ఇప్పటికే బాగా ఆదరణ పొందాయి. తాజాగా రాంచరణ్, హీరోయిన్ కియారా అద్వానీ జంటపై చిత్రీకరించిన 30 సెకన్ల నిడివి ఉన్న ‘తస్సాదియ్యా..’ డ్యూయెట్ వీడియో ప్రోమోను 10.30 గంటలకు యూట్యూబ్‌లో ఈ సినిమా ఆడియో హక్కులు పొందిన లహరి మ్యూజిక్ ఆవిష్కరించింది. ఫాస్ట్ బీట్‌తో మాస్‌ను ఆకట్టుకొనే రీతిలో దేవిశ్రీ స్వరాలు కూర్చిన ఈ పాటను గ్రూప్ డాన్సర్లతో చాలా లావిష్‌గా చిత్రీకరించారు. కాగా ఇంతకు ముందు బయటకు వచ్చిన, రాంబో తరహాలో తన దేహ దారుఢ్యాన్ని ప్రదర్శిస్తూ మెషీన్ గన్‌తో ఫుల్ యాక్షన్ మూడ్‌లో ఉన్న చరణ్ స్టిల్‌కు యమ క్రేజ్ వచ్చేసింది. దీంతో సంక్రాంతి రంగస్థలంపై పోటీ మహా జోరుగా ఉండే అవకాశం కనిపిస్తోంది.