Yatra Gets U Certificate From Censor Board


Yatra Gets U Certificate From Censor Board

సెన్సార్ గడప దాటిన ‘యాత్ర’

వై.ఎస్. రాజశేఖరరెడ్డి రాజకీయ జీవితంలో పాదయాత్ర కీలక ఘట్టం. ఆ సమయంలో జరిగిన ముఖ్య సంఘటనల సమాహారమే ఈ ‘యాత్ర’. వైఎస్సార్ పాత్రను మలయాళ సూప‌ర్‌స్టార్ మమ్ముట్టి పోషించారు. ఇప్పటికే విడుదల చేసిన టీజ‌ర్లు, ట్రైల‌ర్స్ కి చాలా మంచి స్పంద‌న రావ‌టంతో యూనిట్ అంతా ఆనందంగా వుంది. ‘ఆనందో బ్ర‌హ్మ’ లాంటి  హిట్ చిత్రాన్ని అందించిన ద‌ర్శ‌కుడు మ‌హి వి రాఘ‌వ్ ఈ ‘యాత్ర‌’ ని తెర‌కెక్కించారు. ‘భలే మంచి రోజు’, ‘ఆనందో బ్రహ్మ’ వంటి చిత్రాలతో మంచి పేరు సంపాదించుకున్న 70 ఎం ఎం ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ అత్యంత భారీ వ్య‌యంతో, ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా ఈ  చిత్రాన్ని నిర్మించింది. ఈ చిత్రానికి శివ మేక సమర్పకుడు. ఆంధ్రప్ర‌దేశ్ ఎన్నికలు స‌మీపిస్తున్న నేప‌థ్యంలో ఫిబ్ర‌వరి 8న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. అలానే తెలుగుతో పాటు త‌మిళం, మలయాళంలో కూడా ఈ చిత్రాన్ని ఫిబ్ర‌వ‌రి 8న రిలీజ్ చేస్తున్నారు. తెలుగు వెర్షన్ సెన్సారు కార్య‌క్ర‌మాలు పూర్తిచేసుకుంది. క్లీన్ యు స‌ర్టిఫికెట్ ని సొంతం చేసుకుంది.

ఈ సందర్భంగా నిర్మాతలు విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి మాట్లాడుతూ “మ‌డ‌మ‌తిప్ప‌ని నాయకుడు వైఎస్ రాజ‌శేఖ‌ర రెడ్డిగారి జీవితంలో అతి కీల‌క‌మైన పాద‌యాత్ర ఘ‌ట్టాన్ని మెయిన్ గా తీసుకుని ‘యాత్ర’ చిత్రాన్ని నిర్మించాము. మ‌మ్ముటి గారు ప్ర‌‌జానాయ‌కుడు వై ఎస్ ఆర్ పాత్ర‌లో ప‌ర‌కాయ ప్ర‌వేశం చేసి న‌టించార‌నేది ఇప్ప‌టికే ట్రైల‌ర్స్ చూసిన‌వారంద‌రికి తెలిస్తుంది. ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించాం. ఈ చిత్రంలో ఆద్యంతం ఎమోషన్ తో కూడిన పాత్ర‌లు, పాత్ర చిత్రణ కనిపిస్తాయి. తెలుగు ప్ర‌జ‌లంద‌రూ త‌ప్ప‌కుండా చూడ‌వ‌ల‌సిన చిత్రం. మంచి ఎమోష‌న‌ల్ చిత్రాన్ని నిర్మించినందుకు సెన్సారు స‌భ్యులు మా యూనిట్ మొత్తాన్ని అభినందించారు. వారికి మా ధ‌న్య‌వాదాలు. రేపు ప్రేక్ష‌కులు కూడా ఇదే రెస్పాన్స్ ని అందిస్తార‌ని న‌మ్ముతున్నాం” అని చెప్పారు.

రావు రమేష్, జగపతిబాబు, సుహాసిని, అనసూయ, పోసాని, సచిన్ ఖేడ్కర్, వినోద్ కుమార్, జీవా, పృథ్వీ, నాగినీడు తారాగణమైన ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్: సత్యన్ సూర్యన్, మ్యూజిక్: కె (క్రిష్ణ కుమార్), ఎడిటర్: శ్రీకర్ ప్రసాద్, సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి, ప్రొడక్షన్ డిజైన్: రామకృష్ణ, మోనిక సబ్బాని, సౌండ్ డిజైన్: సింక్ సౌండ్, వీఎఫ్ఎక్స్: నాక్ స్టూడియోస్, స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్: మహి వి రాఘవ్.