1st Game In IPL 2019: Dhoni’s CSK Vs Virat’s RCB


1st Game In IPL 2019: Dhoni's CSK Vs Virat's RCB

ఐపీఎల్ తొలి మ్యాచ్: చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజెర్స్ బెంగుళూర్

12వ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లోని తొలి మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజెర్స్ బెంగుళూర్‌ని డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ ఎదుర్కోనున్నది. ఈ మేరకు 2 వారాల షెడ్యూల్‌ను మంగళవారం బీసీసీఐ విడుదల చేసింది.

బీసీసీఐ ప్రకటించిన 17 గేంలతో కూడిన షెడ్యూల్ ప్రకారం మార్చి 23న చెన్నైలో ప్రారంభ మ్యాచ్ జరుగుతుంది. సార్వత్రిక ఎన్నికల తేదీలు ఇంకా ప్రకటించకపోయినప్పటికీ, వాటిని దృష్టిలో పెట్టుకొని ఈసారి షెడ్యూల్‌ను ముందుకు జరిపారు.

“2019 లోక్‌సభ ఎన్నికల తేదీల ప్రకటన కోసం ఎదురు చూస్తున్నాం. ఆ తేదీలు విడుదలైతే, దానికి అనుగుణంగా మిగతా షెడ్యూల్‌ను ప్రిపేర్ చేస్తాం. అవసరమైతే మొదటి రెండు వారాల షెడ్యూల్‌లోనూ మార్పులు చేయొచ్చు” అని ఆ ప్రకటన తెలిపింది.

మార్చి 24న రెండు మ్యాచ్‌లు జరుగుతాయి. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మధ్యాహ్నం నుంచి జరిగే మ్యాచ్‌కి కోల్‌కతా నైట్ రైజర్స్ ఆతిథ్యం ఇస్తే, ఆ తర్వాత ఢిల్లీ కేపిటల్స్‌తో జరిగే గేంకు ముంబై ఇండియన్స్ ఆతిథ్యం ఇవ్వనుంది.

జైపూర్‌లో రాజస్థాన్ రాయల్స్, కింగ్స్ XI పంజాబ్ జట్లు పరస్పరం పోటీపడటంతో తొలి విడత గేంలు ముగుస్తాయి. ఈ రెండు వారాల దశలో వివిధ ఫ్రాంచైజీల సొంత వేదికలపై 17 మ్యాచ్‌లు జరుగుతాయి. ఈ కాలంలో అన్ని జట్లు కనీసం 4 గేంలు ఆడతాయి. ఢిల్లీ కేపిటల్స్, ఆర్‌సీబీ మాత్రం ఒక్కొక్కటి ఐదేసి మ్యాచ్‌లు ఆడనున్నాయి.

ఢిల్లీ, ఆర్సీబీ మినహా ప్రతి జట్టు సొంత వేదికపై రెండు, ప్రత్యర్థి వేదికపై రెండు మ్యాచ్‌లు ఆడతాయి. సొంత వేదికపై ఢిల్లీ 3 గేంలు ఆడితే, ఆర్సీబీ 3 గేంలను ప్రత్యర్థి వేదికపై ఆడుతుంది.