7 People Including An Army Major And 2 JeM Militants Killed In Pulwama Encounter


7 People Including An Army Major And 2 JeM Militants Killed In Pulwama Encounter
CRPF (file)

ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు జైషే తీవ్రవాదులు హతం

జమ్ము కశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో జరిగిన ఒక గన్‌ఫైట్‌లో ఏడుగురు చనిపోయారు. వారిలో ఒక ఆర్మీ మేజర్, ఇద్దరు జైషే మొహమ్మద్ (జేఈఎం) తీవ్రవాదులున్నారు. ఇది ఫిబ్రవరి 14న సీఆర్పీఎఫ్ కాన్వాయ్‌పై భయంకర ఆత్మాహుతి దాడి జరిగిన ప్రదేశానికి 10 కిలో మీటర్ల లోపు దూరంలో చోటు చేసుకుందని సోమవారం పోలీసులు తెలిపారు.

“హతులైన ఇద్దరు జేఈఎం టెర్రరిస్టుల్లో ఒకరు టాప్ కమాండర్. అతనిది పాకిస్తాన్” అని రక్షణ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి కల్నర్ రాజేశ్ కాలియా తెలిపారు.

ఈ తుపాకుల యుద్ధం కారణంగా భిన్న హోదాలకు చెందిన మరో ముగ్గురు సైనికులతో పాటు ముస్తాక్ అహ్మద్ అనే పౌరుడు కూడా మృతి చెందారు.

జేఈఎం మిలిటెంట్లు తలదాచుకున్నారనే సమాచారంతో రాష్ట్రీయ రైఫిల్స్ (ఆర్ఆర్), జమ్ము కశ్మీర్ రాష్ట్ర పోలీసుకు చెందిన స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ (ఎస్ఓజి), సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్)లతో కూడిన భద్రతా బలగాలు పింగ్లేనా గ్రామాన్ని చుట్టుముట్టినప్పుడు ఆదివారం రాత్రి ఈ ఎన్‌కౌంటర్ చోటు చేసుకుంది.

“భద్రతా వలయం బిగుసుకోవడంతో దిక్కుతోచని తీవ్రవాదులు గన్‌లతో కాల్చడం మొదలుపెట్టారు. దాంతో ఇరు వైపుల నుంచీ కాల్పులు కొనసాగాయి” అని తెలిపారు కాలియా.