A Humble Request From An Akkineni Fan!


A Humble Request From An Akkineni Fan!
Majnu (1987) movie collections

సినిమా ఎప్పుడు రిలీజైందనేదీ ముఖ్యమే!

సినిమాని ఎలా తీశామనేదే కాదు, ఎప్పుడు రిలీజ్ చేశామనేది కూడా ముఖ్యం. కొన్ని మంచి సినిమాలు కూడా కాలం కాని కాలంలో విడుదలై దెబ్బతిన్నవి ఉన్నాయి. ప్రేక్షకులు ఎక్కువగా థియేటర్లకు వచ్చే సమయాలు చూసుకొని విడుదల చేసిన సినిమాలు అంత బాగోపోయినా ఆడిన సందర్భాలున్నాయి.

ఇదంతా చెప్పడం ఎందుకంటే ఇప్పుడు ఒక అభిమాని అఖిల్ హీరోగా నటించిన ‘మిస్టర్ మజ్ను’ సినిమా విషయంలో ఇలాంటి అభిప్రాయమే వ్యక్తం చేశారు. ఆ సినిమా బాగున్నా సరైన సమయంలో విడుదల చెయ్యలేదనీ, అందుకే సరిగా ఆడట్లేదనే విషయాన్ని పరోక్షంగా తెలియజేస్తూ, నాగార్జున టైటిల్ రోల్ చేసిన ‘మజ్ను’ సినిమా సంక్రాంతికి విడుదలై ఎంత ఘన విజయం సాధించిందో అప్పటి కలెక్షన్ల లెక్కల్నీ ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు.

‘మజ్ను’ సినిమా 1987 జనవరి 14న విడుదలై ఘన విజయం సాధించింది. హీరోగా నాగార్జున ఇమేజ్‌ను పెంచింది. విజయవాడలో ఆ సినిమా రెండో వారం రికార్డ్ కలెక్షన్ల వివరాల్ని జి.ఎన్. రావు అనే అభిమాని తన ట్విట్టర్ పేజీలో పోస్ట్ చేశారు.

“మంచి సినిమా తీసినంత మాత్రాన సరిపోదు అఖిల్. మంచి డేట్‌కి రిలీజ్ చేయడం కూడా చాలా ముఖ్యం. నాన్నగారి “మజ్ను” లవ్ స్టోరీ అయినా, పక్కన మాస్ సినిమాలు ఉన్నా సంక్రాంతికి విడుదలై ఘన విజయం సాధించింది. ఈసారైనా రిలీజ్ డేట్ విషయములో జాగ్రత్త వహించు బాబు. This is our humble request” అని అభ్యర్థించారు. ఆ ట్వీట్‌కు మంచి స్పందన వస్తోంది.

‘మిస్టర్ మజ్ను’ జనవరి 25న విడుదలై ప్రేక్షకుల్ని ఆకట్టుకోవడంలో విఫలమైంది.

A Humble Request From An Akkineni Fan!
A still from Mr Majnu