‘Akram’ First Look Launched


'Akram' First Look Launched

‘అక్ర‌మ్’ చిత్రం ఫస్ట్ లుక్ లాంచ్‌

అక్ర‌మ్ సురేష్ హీరోగా రాజధాని అమరావతి మూవీస్ బ్యానర్ లో భారీ మాస్ యాక్ష‌న్ మూవీ చిత్రీక‌ర‌ణ శ‌ర‌వేగంగా సాగుతోంది. ఒక షెడ్యూల్, రెండు పాట‌లు మిన‌హా చిత్రీక‌ర‌ణ పూర్త‌యింది. హాలీవుడ్ రేంజులో తెర‌కెక్కుతున్న చిత్ర‌మిది.

హీరో అక్ర‌మ్‌ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా రాణా పాత్ర లుక్ ని సీనియ‌ర్‌ హీరో సుమ‌న్ లాంచ్ చేశారు. రామోజీ ఫిలింసిటీలో జ‌రిగిన ఈ కార్య‌క్ర‌మంలో చిత్ర స‌మ‌ర్ప‌కుడు విస్సాకోటి, శివ‌కుమార్ ఇత‌ర టీమ్ పాల్గొన్నారు.

ద‌ర్శ‌కనిర్మాత‌లు మాట్లాడుతూ-‘డాన్ బ్యాక్ డ్రాప్ లో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో రాక్, రాణా, అక్ర‌మ్‌, రాణా ప్ర‌తాప్ సింగ్ అనే నాలుగు గెట‌ప్పుల్లో హీరో న‌టిస్తాడు. క్లాస్, మాస్, ఫ్యామిలీ ఆడియెన్స్.. చిన్నా పెద్దా అంద‌రికీ న‌చ్చే చిత్ర‌మిది. భారీ సెట్ లో చిత్రీక‌రించిన ఇంట‌ర్వెల్ సీన్ హైలైట్. క‌థానుసారం అద్భుత‌మైన నిర్మాణ విలువ‌ల‌తో ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. ఇది మోస్ట్ స్టైలిష్ యాక్ష‌న్ సినిమా. అత్యంత ఖ‌రీదైన కార్ల‌ను, దిగుమ‌తి చేసిన బైక్ ల‌ను ఉప‌యోగించారు. త్వ‌ర‌లో రాక్ లుక్‌ని, ఉగాదికి టీజ‌ర్ ని రిలీజ్ చేస్తాం’ అని అన్నారు.
ఒక షెడ్యూల్, రెండు పాట‌లు మిన‌హా చిత్రీక‌ర‌ణ పూర్త‌యింది.

పోసాని, సుమ‌న్, లిపికా త‌దిత‌రులు న‌టించారు. దిల్లీ భామ ఖుషీ క‌థానాయిక‌గా ప‌రిచ‌యం అవుతోంది. ఈ చిత్రానికి సంగీతం:ఎం.యు.సాయి, ఎడిటింగ్: గౌతం రాజు, కెమెరా: అనీల్, క‌థ‌-క‌థ‌నం-డైలాగ్స్-ద‌ర్శ‌క‌త్వం: సురేష్ మేడిది.

'Akram' First Look Launched